మృణాల్ ఠాకూర్ పేరు వస్తే ఎవరికైనా సీతారామం సినిమానే గుర్తొస్తుంది. దీనికి కారణం ఇందులో ఆమె నటించిన సీత పాత్రకి చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అవ్వడమే. అయితే గత కొంతకాలంగా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ఎక్స్ పోజింగ్ తో చెలరేగిపోతుంది. తాజాగా బికినీ వేసి కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది.
సాధారణంగా హీరోయిన్లు సినిమాల్లో హాట్ గా కనిపిస్తేనే అమ్మడు చాలా బోల్డ్ అని చెప్పుకుంటారు. ఇక బికినీ వేస్తే ఇంకేమైనా ఉందా.. సినిమా మొత్తంలో అదే హాట్ టాపిక్ గా మారుతుంది. వీరు ఇంతటితో ఆగుతారా అంటే అది జరగని పని. సినిమాలకు మించి బయట అందాలను ఆరబోయటానికి రెడీ గా ఉంటారు ముద్దుగుమ్మలు. సోషల్ మీడియా వేదికగా వీరు చేసే రచ్చ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది. ఒకరిని మించి మరొకరు అనేలా వీరి అందాన్ని చూపిస్తూ.. అభిమానులని పలకరిస్తూ ఉంటారు. తాజాగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ చేసిన గ్లామర్ షో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఎప్పుడు లేని విధంగా ఈ సారి బీచ్ ఒడ్డున బికినీలో దర్శనమిచ్చింది ఈ బ్యూటీ.
మృణాల్ ఠాకూర్ పేరు వస్తే ఎవరికైనా సీతారామం సినిమానే గుర్తొస్తుంది. దీనికి కారణం ఇందులో ఆమె నటించిన సీత పాత్రకి చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అవ్వడమే. కొంచెం కూడా ఎక్స్ పోజింగ్ చేయకుండా ఈ పాత్రలో ఈ బ్యూటీ చాలా హుందాగా కనిపించింది. ఈమెకు తెలుగులో ఇదే తొలి సినిమా అయినా.. ఈ ఒక్క సినిమాతోనే ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తొలినాళ్లలో బాలీవుడ్ సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడికి తగిన గుర్తింపు మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు వరుసబెట్టి ఆఫర్లను అందుకుంటూ బిజీగా మారిపోయింది మృణాల్. కాగా ప్రస్తుతం హాట్ లుక్స్ తో అభిమానులని అలరించే పనిలో ఉంది ఈ సోయగం. గత కొంతకాలంగా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ఎక్స్ పోజింగ్ తో చెలరేగిపోతుంది. అక్షయ కుమార్ సినిమాలో హద్దు మీరి మరీ అందాలను చూపించిన ఈ భామ ఇప్పుడు బీచ్ ఒడ్డున బికినీలో అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచేస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది.
మృణాల్ ఠాకూర్ సినిమాల్లోనే కాదు బయట కూడా అభిమానులని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా బ్లూ కలర్ బికినీ వేసుకొని బీచ్ లో చిల్ల్ అవుతూ కనిపించింది ఈ భామ. జుట్టుని అలా వదిలేసి నవ్వుతూ కనిపించింది. చుట్టూ చెట్లు, నీరు మాత్రమే కనిపిస్తున్న ఆ ప్లేస్ లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తోంది ఈ హాట్ బ్యూటీ. సీతారామం సినిమాతో క్లాస్ ఆడియన్స్ కి దగ్గరైన ఈ భామ ఇప్పుడు యూత్ మొత్తాన్ని తనవైపు లాగేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి బీచ్ ఒడ్డున బ్లూ కలర్ బికినీలో మృణాల్ ఠాకూర్ చేసిన సందడి మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.