సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచమని చాలా మంది అంటుంటారు. అలానే హీరోయిన్లు కూడా ఫేమ్ ఉన్నప్పుడే కాస్తా డబ్బులు వెనుకేసుకోవాలంటారు. తాజాగా ఓ హీరోయిన తన అందంతోనే వ్యాపారం ప్రారంభించింది.
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచమని చాలా మంది అంటుంటారు. అలానే హీరోయిన్లు కూడా ఫేమ్ ఉన్నప్పుడే కాస్తా డబ్బులు వెనుకేసుకోవాలంటారు. అలానే హీరోయిన్లు.. తమ అందంతోనే సినిమా అవకాశాలు పొందుతారని చాలా మంది అభిప్రాయాపడతారు. అయితే అది ఒకప్పటి మాట. ఓ హీరోయిన్ అయితే ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన కూడా త న అందంతో వ్యాపారం మొదలు పెట్టింది. అయితే ఆమె ఎవరు? ఆమె అందంతో ఏం వ్యాపారం ప్రారంభించింది? ఆమె స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఒకప్పటి హీరోయిన్ కిరణ్ రాథోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కి ఈమె కజిన్. అందుకూ వీరిద్దరికి చాలా వరకు దగ్గర పొలికాలు ఉంటాయి. ఇక కిరణ్ రాథోడ్ విషయానికి వస్తే.. 2002లో విక్రమ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘జెమినీ’తో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ మంచి హిట్ అవ్వడంతో కిరణ్ కి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. విలన్, అన్బే శివమ్, విన్నర్, తెన్నవన్, ఆంబళ్ వంటి పలు తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించింది. పలు తెలుగు సినిమాలో నటించి.. ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయారు.
కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో మంచి జోరు చూపించిన ఈ బ్యూటీ ఆ తరువాత అవకాశాలు లేక సైలెంట్ అయిపోయింది. 41 ఏళ్ల వయసులో ఈ భామ తాజాగా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. తన హాట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో నాన్ స్టాప్ గా షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను నిద్ర లేకుండా చేస్తుంది. అంతటితో ఆగకుండా కిరణ్ పేరుతో ఒక యాప్ ను ప్రారంభించి ఫ్యాన్స్ తో వ్యాపారం చేయడానికి రెడీ అయ్యింది ఈ అమ్మడు. ఇక ఈ యాప్ గురించి తెలిసిన వాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి. ఆ తరువాత యాప్ ద్వారా రూ.1000 చెల్లిస్తే.. ఈ బ్యూటీ తని రెండు గ్లామరస్ ఫోటోలు పంపుతుంది. అంతేకాక ఎవరైన ఆమెతో మాట్లాడలంటే కూడా అవకాశం కల్పిస్తుంది.
అయితే వాటికి కూడా వివిధ కేటగిరీలను పట్టి రేట్లు ఫిక్స్ చేసిందంట. ఈ బ్యూటీతో 5 నిమిషాలు మాట్లాడాలంటే రూ.10 వేలు చెల్లించాలట. అదే ఆమెతో లైవ్ లో చూస్తూ మాట్లాడలంటే 15 నిమిషాలకు రూ.14 వేలు, 25 నిమిషాలకు రూ.25 వేలు చెల్లించాలట. మంచి యువతులు చరిత్రకెక్కలేరని, ధైర్యం కలవారే చరిత్ర సృష్టించగలరంటూ తన ఇన్ స్టా గ్రామ్ లో కామెంట్ కూడా పెట్టింది.ఈ వ్యాపారాన్ని కొందరు సమర్థిస్తుంటే .. మరికొందరు విమర్శిస్తున్నారు. మరి.. కిరణ్ రాథోడ్ ప్రారంభించిన ఈ వ్యాపారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.