సమంత లీడ్ రోల్లో నటించిన యశోద సినిమా మంచి టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా మరింత వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే సమంత తాను మయోసైటిస్ అనే అరుధైన వ్యాధితో బాధపడుతోందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మళ్లీ ఆమె ఆర్యోగంపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు సమంత ఆరోగ్యానికి సంబంధింన అప్డేట్ ఒకటి వచ్చింది. యశోద సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమంత హాజరు కాలేదు. కానీ, చిత్రబృందం ఈ సక్సెస్ మీట్లో పాల్గొని సందడి చేశారు. యశోద సినిమాలో సమంతతో కలిసి నటించిన నటి కల్పిక కూడా పాల్గొన్నారు.
నటి కల్పిక మాట్లాడుతూ.. “సమంత ఈ కార్యక్రమానికి వస్తోందని నాతో అబద్ధం చెప్పారు. సమంత వస్తోందని తెలిసే నేను పరుగులు పెట్టుకుంటూ వచ్చాను. నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుని ఈ మీట్‌కి వచ్చాను. సమంతలాగానే నేను కూడా అదే సమస్యతో బాధపడుతున్నాను. నేను గత 13 ఏళ్లుగా అదే సమస్యను ఎదుర్కొంటున్నాను. నేను ఇప్పుడు మయోసైటిస్ తొలి దశలోనే ఉన్నాను. ఆమె(సమంత)ది థర్డ్ స్టేజ్. మేమంతా సమంతని బాగా మిస్ అవుతున్నాం” అంటూ నటి కల్పిక ఎమోషనల్ అయ్యింది. అయితే కల్పన కూడా అలాంటి వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు ఇంత వరకు ఎప్పుడూ చెప్పుకోలేదు.
ఇంక సినిమా విషయానికి వస్తే.. హరి- హరీష్ ఇద్దరు దర్శకులు కలిసి రచించి, తెరకెక్కించిన చిత్రం యశోద. మెడికల్ ఫీల్డ్ జరుగుతున్న అక్రమాలను ఎత్తిచూపేదిగా ఈ సినిమాని నిర్మించారు. ముఖ్యంగా సరోగసి పేరిట ఎలాంటి క్రైమ్ చేయచ్చో.. ఎలాంటి మోసాలు చేసేందుకు తావుంటుందో ఈ సినిమాలో ఎత్తిచూపారు. కలెక్షన్స్ పరంగా ఇప్పటికే యశోద ఐదురోజుల్లో రూ.21.45 కోట్లని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో రూ.5.8 కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది. ఈ సినిమా బడ్జెట్ రూ.30 కోట్లు. యశోద మూవీలో సమంత నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో ఆమె నటించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది.