హీరోయిన్ హన్సిక చాలా తక్కువ వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే స్టార్ స్టేటస్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఈ క్రమంలోనే రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా బాత్ టబ్ లో ఉన్న ఫోటోను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఒకప్పుడు సినిమాల్లోకి రావటానికి హీరోయిన్లు హాట్ ఫోటో షూట్ లతో హడావుడి చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందాలను చూపించటానికి సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. ప్రతిరోజు ఎవరో ఒకరు హాట్ ఫొటోలను ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో పెడుతూ కుర్రాళ్లను హీటెక్కిస్తూ ఉంటారు. ఒకరిని మించిన గ్లామర్ మరొకరి సొంతం అనేలా ఉంటుంది వీరి శృతిమించిన ఎక్స్ పోజింగ్ . ఈ లిస్టులో ప్రస్తుతం సినిమాల్లో నటించే భామలతో పాటు, ఒకప్పటి హీరోయిన్లు కూడా అప్పుడప్పుడు తమ వయ్యారాలు చూపిస్తూ ఉంటారు . తాజాగా.. హీరోయిన్ హన్సిక అదిరిపోయే అందాలతో హాట్ లుక్కులో దర్శనమిచ్చింది. బాత్ టబ్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హీరోయిన్ హన్సిక చాలా తక్కువ వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో చాలా మంది హీరోలతో నటించినా.. స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కలేదు. 15 ఏళ్లకే దేశముదురు సినిమాలో కనిపించిన ఈ అమ్మడు.. ఇక ఆ సినిమా తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ భారీ హిట్ లేదు. దీంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ బొద్దుగా మారిపోయి మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ప్రస్తుతం చిన్న సినిమాల్లో నటిస్తూ అభిమానులని పలకరిస్తున్న ఈ ఆపిల్ బ్యూటీ.. టబ్ లో స్నానం చేస్తున్న ఒక ఫోటో తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే కేవలం తన ముఖాన్ని, ఎద పై భాగాన్ని మాత్రమే చూపించి కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది ఈ ఆపిల్ బ్యూటీ. ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ బాత్రూంలో హన్సిక అందాలు అంతకు మించి ఉన్నాయి.
వయసు పెరుగుతున్నా ఈ 33 ఏళ్ళ బ్యూటీకి అందం చెక్కు చెదరడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. హన్సిక ఇలా హాట్ లుక్కులో కనిపించడం ఇది తొలిసారేమి కాదు. ఇదివరకు ఈ భామ ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ఇక చివరగా మాహా సినిమాలో కనిపించిన హన్సిక ప్రస్తుతం తెలుగులో “మై నేమ్ ఈజ్ శృతి” అనే సినిమా చేస్తూనే.. తమిళ్లో పార్ట్ నర్,ఘాందారి సినిమాల్లో నటిస్తోంది. ఒక వైపు సినిమాలు మరో వైపు ఇలా హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కెరీర్ నెట్టుకొచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. దాంతో ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. పెళ్లైయ్యాక కూడా ఇలాంటి పనులు ఏంటి అంటూ విమర్శిస్తున్నారు.