సీనియర్ నటి అర్చన గురించి ఇప్పటి వారికి తెలియకపోవచ్చుగాని, మనకంటే ముందు తరం వారికి ఆమె గురించి ప్రత్యేక పరిచకం అక్కర్లేదు. అర్చన తన అందం, నటనతో తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించింది. తెలుగులో కోకిల, భారత్ బంద్ , దాసి, లేడీస్ టైలర్, నిరీక్షణ మొదలైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాందించింది. ఆమె నటనకు “ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం”, “ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు”లు వరించాయి. చాలాకాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ “చోర్ బజార్” చిత్రంతో తెలుగు తెరపై కనిపించబోతోంది అర్చన. జూన్ 24న ‘చోర్ బజార్’ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన విశేషలతో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు సీనియర్ నటి అర్చన.
దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘చోర్ జజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ నటి అర్చన.. తన కెరీర్ తో పాటు చిత్ర విశేషాలను తెలిపారు. “చోర్ బజార్” ఫుల్ ఎంటర్ టైన్ మెంట్, కమర్షియల్, కలర్ ఫుల్ ఫిల్మ్. అందుకే ఈ చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రలో నటించానని, ఇదొక మాస్ ఫిల్మ్. తన జానర్ దాటి బయటకొచ్చి నటించానని తెలిపారు. ఇంకా అర్చన మాట్లాడుతూ..” నాగురువులు, దర్శకులు నన్ను సినీ పరిశ్రమలో ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. 300 సినిమాలు చేసిన నటికి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో అదే స్థాయి గుర్తింపును భారతీయ సినీ పరిశ్రమ మరియు నా దర్శకులు నాకు ఇచ్చారు. ఆ గౌరవాన్ని కాపాడుకునే బాధ్యత నాపై ఉంది. నేను చెన్నైలో ఉంటున్నాను. అందుకే హైదరాబాద్ రాలేకపోయేదాన్ని. దీంతో తెలుగులో చాలా గ్యాప్ వచ్చింది.
హీరో సరసన నటించిన హీరోయిన్ కొంత కాలానికి అదే హీరోకి సోదరి, వదిన, తల్లి, అత్త అవుతోంది. మన సినిమాల్లో మహిళా పాత్రలకు 80 శాతం ప్రాధాన్యత ఉండటం లేదు. మరాఠీలో మహిళలకు ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు దక్కుతున్నాయి. నా వయసువాళ్లు అక్కడ లవ్ స్టోరీస్‌లో నటిస్తున్నారు.. బోల్డ్ సీన్స్‌లో నటిస్తున్నారు. ఇక ఈ ‘చోర్ బజార్’ సినిమా విషయానికి వస్తే.. ఇందులో నాది అమితాబ్ బచ్చన్ అభిమాని పాత్ర. ఆయన్ను ప్రేమించి, ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయే క్యారెక్టర్. ఈ మూవీలో హీరోకు, నాకు అమితాబ్ అంటే ఇష్టం. అర్చన అంటే నెక్ట్స్ డోర్ ఉమెన్ అనే ఇమేజ్ ఉంది.. ఆ గుర్తింపును ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం తమిళంలో ఒకటి, కన్నడలో ఒక ఆర్ట్ ఫిలిం చేస్తున్నాను” అన్నారు.