ఈ ఫొటోలో ఉన్న చిన్న పాప ఇప్పుడో స్టార్ హీరోయిన్. ఆమెకు పెద్దగా పరిచయం కూడా అక్కర్లేదు. తెలుగులో దాదాపు ఐదుకుపైగా సినిమాలు చేశారు. వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్లిపోతున్నారు. ఈ హీరోయిన్ బోల్డ్ నటనకు పెట్టింది పేరు. ఈమె ఆర్జీవీతో కూడా సినిమాలు చేశారు. అంతకుముందెన్నడూ రాని గుర్తింపు ఆర్జీవీ సినిమాతో వచ్చేసింది. ఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘‘ డేంజరస్’’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ ఆర్జీవీ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈమె 1996 జనవరి 12న డెహ్రాడూన్‌లో పుట్టారు. ఈమె అసలు పేరు అంకెత మహారానా. చిన్నప్పటినుంచే నటించటం మొదలుపెట్టారు. చిన్న వయసులోనే హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారు.
బీటెక్ పూర్తి చేసిన తర్వాత సినిమా అవకాశాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. 2019లో వచ్చిన తెలుగు సినిమా ‘‘ 4 లెటర్స్’’తో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తర్వాత ఊల్లాలా ఊల్లాలా సినిమా చేశారు. థ్రిల్లర్ అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ నటించారు. క్రాక్ సినిమాతో స్పెషల్ సాంగ్‌లు చేయటం మొదలుపెట్టారు. డీ కంపెనీ, సీటీమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్‌లు చేశారు. హంట్ సినిమాలోనూ ఓ సాంగ్ చేయబోతున్నారు. ఇక, ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 50వేలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తన మోడలింగ్ ఫొటోలతో అభిమానులను ఫుల్ ఖుష్ చేస్తూ ఉంటారు.