Tyler: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కెరీర్ ప్రారంభించిన కొన్నేళ్ళకే నటుడు చనిపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. హాలీవుడ్ యువనటుడు టైలర్ సాండర్స్ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. 18 సంవత్సరాల వయసు కలిగిన టైలర్.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ జస్ట్ యాడ్ మ్యాజిక్: మిస్టరీ సిటీ’ వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయ్యాడు. అలాగే ఈ సిరీస్ తాను పోషించిన ‘లియో’తో ఎమ్మీ అవార్డుకు కూడా నామినేట్ అయినట్లు తెలుస్తుంది.
టైలర్.. లాస్ ఏంజిల్స్‌లో చనిపోయినట్లు ఏజెంట్ పెడ్రో టాపియా ధృవీకరించారు. అయితే.. ఇప్పటివరకూ టైలర్ మరణానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. టైలర్ మృతిని అనుమానాస్పద మృతిగా భావించి.. పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా పెడ్రో తెలిపాడు. దర్యాప్తు దశలో ఉన్న టైలర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇక టైలర్ పదేళ్ల వయసులోనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం స్టార్ట్ చేశాడు. 2017లో మొదటిసారి ‘ఫియర్ ది వాకింగ్ డెడ్’ ఎపిసోడ్‌లో ప్రధాన పాత్ర సామ్ అండర్‌వుడ్ చిన్ననాటి పాత్రలో నటించి బుల్లితెరపై యాక్టర్ గా డెబ్యూ చేశాడు. అలాగే 2018లో ‘ది రూకీ’ అనే సిరీస్, ‘9-1-1: లోన్ స్టార్’ సిరీస్ లలో చివరిసారిగా కనిపించాడు. ఇక 2019లో పిల్లల ఫాంటసీ సిరీస్ ‘జస్ట్ యాడ్ మ్యాజిక్’ చివరి ఎపిసోడ్‌లో సాండర్స్ అతిధి పాత్రలో దర్శనమిచ్చాడు.
జస్ట్ యాడ్ మ్యాజిక్ లో లియో పాత్రను పోషించినందుకు ఎమ్మీ అవార్డుకు నామినేషన్ అయ్యాడు టైలర్.. ఇక ఇటీవలే ర్యూహీ కితామురా దర్శకత్వంలో స్టీఫెన్ డార్ఫ్ నటించిన ‘ది ప్రైస్ వుయ్ ప్లే’ మూవీలో తన షూటింగ్ పూర్తిచేశాడు. చిన్న వయసులోనే టాలెంటెడ్ యాక్టర్ చనిపోవడంతో హాలీవుడ్ లో విషాద ఛాయలు పులుముకున్నాయి. మరి 18 ఏళ్లకే చనిపోయిన టైలర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.