ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తుళు యాక్టర్ సునీల్ బాజాల్ మే 22న తుదిశ్వాస విడిచారు. 45 ఏళ్ళ వయసు కలిగిన సునీల్.. గుండెపోటు కారణంగా మరణించినట్లు సమాచారం. సునీల్ బాజాల్.. కెరీర్ పరంగా కొంకణి మరియు తుళు పరిశ్రమలలో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే.. కొంకణి నాటకాల ద్వారా సీరియల్స్, సినిమాల్లో అవకాశాలు పొందినట్లు తెలుస్తుంది.
సునీల్ కి కొంకణి నాటకాలే నటుడిగా లైఫ్ ఇచ్చాయని.. కొంకణి నాటకాలలో పోషించిన ప్రముఖ పాత్రల ద్వారానే కొంకణి సీరియల్ ఇండస్ట్రీలో అవకాశాలు చేజిక్కించుకున్నాడని అక్కడి సినీవర్గాలు చెబుతున్నాయి. సునీల్ కి నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చిన సీరియల్స్ లో ‘ఫ్లాట్ నెంబర్ 403’ ఒకటి. అందులో ఆయన పోషించిన బెన్నా పాత్రతో ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. వృత్తిరీత్యా ఐటీఐ విద్యార్థులకు అధ్యాపకుడు అయినటువంటి సునీల్.. మంగుళూరులోని కొంకణి నాటక సభలో యాక్టీవ్ మెంబర్ కూడా కావడం విశేషం.
అదేవిధంగా సునీల్ బాజాల్ కి పాపులారిటీ తెచ్చిన వాటిలో ‘గాడ్ ఫాధర్’ సీరియల్, కొంబ్యాట్ సినిమా కూడా ఉన్నాయి. ఇక సునీల్ కుటుంబం విషయానికి వస్తే.. ఆయనకు భార్య లినెట్ క్రాస్టా, పిల్లలు సియానా, డారెన్ లతో పాటు.. తల్లి లీనా క్రాస్టా, సోదరి లవీనా క్రాస్టా, సోదరుడు అనిల్ క్రాస్టా ఉన్నారు. సోమవారం మే 23న సునీల్ బాజాల్ అంత్యక్రియలు హోలీ స్పిరిట్ చర్చిలో జరిగినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. నటుడు సునీల్ బాజాల్ కి కొంకణి, తుళు ఇండస్ట్రీల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మరి సునీల్ బాజాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.