రాజకీయాలకు వస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు నటుడు సుమన్.. తన కుమార్తె పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు..
నీచల్ కులమ్(తమిళ) సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసిన సుమన్.. సుమారు 45 ఏళ్లుగా నటుడిగా సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 90ల్లో అగ్ర హీరోగా రాణించిన సుమన్ యాక్షన్ సినిమాలతో పాటు భక్తి చిత్రాలతోనూ మెప్పించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఇక తాఆజగా రాజకీయాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను రాజకీయాల్లోకి వస్తానని.. బీఆర్ఎస్ పార్టీకే తన మద్దతు ఇస్తానని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా తాజాగా సుమన్.. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో తన కుమార్తె ప్రస్తావన తీసుకువచ్చిన సుమన్ ఆమె పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై స్పందించాడు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ‘‘నా కుమార్తె.. అఖిలజ ప్రత్యూష గోల్డ్ మెడలిస్ట్. తనకు యాక్టింగ్ మీద ఆసక్తి లేదు. రెండేళ్ల క్రితం ఆమె మణిపాల్ యూనివర్సిటీలో హ్యూమన్ జెనిటిక్స్‌లో గోల్డ్ మెడల్ సంపాదించింది. గత కొంత కాలంగా.. నా కుమార్తె సౌత్ ఇండియాలోని స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్తుందంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆమెకు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో దాని గురించి ఆలోచించలేదు. తన చదువు పూర్తయ్యాకే ఆమె పెళ్లిపై దృష్టి పెడతాం’’ అన్నారు సుమన్.
ఇక ఇదే ఇంటర్వ్యూలో తన గత జీవితం గురించి కూడా సుమన్ ప్రస్తావించాడు. ‘‘నేను జైలుకు ఎందుకు వెళ్లానో అందరికీ తెలుసు. ఆ కేసులో నా ప్రమేయం లేకపోయినా నన్ను లోపలేశారు. ఆ సమయంలో సుహాసిని, సుమలత నాకు మద్దతుగా మాట్లాడారు. సుమన్ ఇలాంటి చీప్ పనులు చేయడని స్టేట్మంట్ ఇచ్చారు. అది నాకు ఎంతో మేలు చేసింది’’ అని చెప్పుకొచ్చారు.
1985లో సుమన్ మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆయన జైలుపాలయ్యారు. అందుకు కారణం సుమన్ స్నేహితుడ దివాకర్. తనకు క్యాసెట్ రెంట్‌కు ఇచ్చే షాపు ఉంది. ఆయన దగ్గర సుమన్ అప్పుడప్పుడు సినిమా క్యాసెట్లు తీసుకునేవారు. అలా వారి మధ్య స్నేహం కుదిరింది. ఇలా ఉండగా ఓ సారి దివాకర్.. కార్ కావాలని సుమన్‌ని అడిగాడు. తన స్నేహితుడే కావడంతో కారు ఇచ్చారు సుమన్. దాన్ని దివాకర్ నీలి చిత్రంలో వాడాడట. దీంతో ఇందులో సుమన్ హస్తం కూడా ఉందని పోలీసులు ఆయనని అరెస్ట్ చేసి జైలులో వేశారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఆ తర్వాత ఈ కేసులో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ అప్పటికే హీరోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమన్ జైలు నుంచి బయటకు వచ్చాక రచయిత డీవీ నరసరాజు మనవరాలు శిరీషను పెళ్లాడారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.