టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు రెండు రోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. శరత్ బాబుకు సంతానం లేరు. ఈ క్రమంలో ఆయన ఆస్తులకు వారసులు ఎవరు అనే దానిపై చర్చ సాగుతోంది. తాజాగా ఈ అంశంపై శరత్ బాబు సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
శరత్ బాబు.. తెలుగు సినీ చరిత్రలో ఆయనకు ఓ ప్రత్యేక ప్రస్థానం ఉంది. తెలుగు, తమిళంలో సుమారు 300 వందలకు పైగా చిత్రాల్లో నటించారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు శరత్ బాబు. తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన శరత్ బాబు.. మే 22, సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు.. సోమవారం ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో మంగళవారం చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. అయతే శరత్ బాబుకు సంతానం లేదనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శరత్ బాబు మృతి తర్వాత.. ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయి.. వాటికి వారసులు ఎవరు అనే దానిపై జోరుగా సాగుతోంది. ఆ వివరాలు..
ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ చానెల్.. శరత్ బాబు చిన్న చెల్లెలు సరితని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో శరత్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. అన్నయ్యే తనకు అమ్మానాన్న అని.. తన పెళ్లి కూడా ఆయనే చేశారని చెప్పుకొచ్చారు. తన కొడుకును ఆయనే చదివిస్తున్నాడని.. తన కుమార్తె సోనియా పెళ్లి కూడా శరత్ బాబే చేశారని వెల్లడించారు. ఆఖరి సారిగా తన కుమార్తె సోనియా డెలివరీ కోసం బెంగళూరు వచ్చారని.. ఆ తర్వాతే ఆయన అనారోగ్యానికి గురయ్యారని చెప్పుకొచ్చారు సరిత. .
శరత్‌బాబుకు పిల్లలు లేరు.. ఈ క్రమంలో ఆయన సోనియాను దత్తత తీసుకోవాలని భావించారని శరత్ బాబు సోదరి వెల్లడించారు. కానీ ఆ ప్రయత్నం ఆగిపోయిందని అని.. చెప్పుకొచ్చారు. శరత్ బాబు కూడా చాలా సార్లు సోనియాను దత్తత ఇవ్వమని అడిగారని.. తాను నవ్వి ఉరుకునేదాన్ని అని చెప్పుకొచ్చారు. మరి ప్రస్తుతం శరత్ బాబు ఆస్తికి వారసులు ఎవరు అంటే తనకు తెలియదు అన్నారు సరిత. దీని గురించి సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు తనకు తెలియదు అని చెప్పుకొచ్చారు.