ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అటు కుటుంబ సభ్యులను.. ఇటు ఫ్యాన్స్ ని శోకసంద్రంలో ముంచేస్తున్నాయి.
ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలు ఇండస్ట్రీలకు చెందిన దిగ్గజ నటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా హాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్టార్ నటుడు సెయింట్ వాన్ కోలుచి కన్నుమూశాడు. వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కెనడా నటుడు సెయింట్ వాన్ కొలూస్సీ కన్నుమూశాడు.. వయసు 22 సంవత్సరాలు. సెయింట్ వాన్ తన ముఖానికి పలుమార్లు సర్జరీ చేయించుకోవడం వల్లనే అతడు మరణించిట్లు తెలుస్తుంది. దక్షిణ కొరియా మ్యూజిక్ బ్యాండ్ ‘బీటీఎస్’ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సంగీత ప్రపంచంలోకి బీటీఎస్ ఓ ప్రభంజనంలా దూసుకు వచ్చింది. ఈ బ్యాండ్ లో గాయకుల బృందానికి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు సెలబ్రెటీలు కూడా బీటీఎస్ ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో కెనడా నటుడు సెయింట్ వాన్ కొలూస్సీ.. బీటీఎస్ బ్యాండ్ లోని జిమిన్ లా కనిపించాలనే కోరిక బలంగా ఉండేది. అదే అతని ప్రాణాల మీదకు తెచ్చిందిన అంటున్నారు.
బీటీఎస్ బృందంలోని సింగర్ జమిన్ అంటే ఎంతగానో అభిమానించేవాడు సెయింట్ వాన్ కొలూస్సీ. తన ముఖం అచ్చం అతనిలా కనిపించేందుకు దాదాపు 12 రకాల సర్జరీలు చేయించుకున్నాడు. ఈ సర్జరీల కోసం సెయింట్ వాన్ ఏకంగా 2,20,000 డాలర్లు ఖర్చు చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. గత ఏడాది నవంబర్ లో దవడకు కొన్ని ఇంప్లాంట్స్ ను సర్జరీ ద్వారా అమర్చారు. ఏప్రిల్ 22 న ఆ ఇంప్లాంట్స్ ని తొలగించేందుకు చివరి సర్జరీ నిర్వహించారు. అది కాస్త ఇన్ ఫెక్షన్ కి దారి తీయడంతో సెయింట్ వాన్ కొద్ది గంటల్లోనే మృతి చెందాడు. ఈ విషయాన్ని కెనడా నటుడి పీఆర్వో ఎరిక్ బ్లేక్ వెల్లడించారు. 2019లో కెనడా నుంచి దక్షిణ కొరియాకు వెళ్లినట్లు.. అక్కడ కొరియన్ల తరహా ముఖాకృతిలోకి తన ముఖాన్ని మార్చుకోవడం పై దృష్టి పెట్టినట్టు..ముఖ్యంగా తాను ఎంతో ఇష్టపడే జిమిన్ లా కనిపించాలనే కోరిక తో సర్జరీలు చేయించుకున్నాడని సెయింట్ సన్నిహితులు తెలిపారు. కానీ అతని కోరిక తీరకుండానే లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు.