కార్తికేయ కటౌట్ కి ఎవరైనా యాక్షన్ సినిమాలే ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ.. ఈసారి వినూత్నంగా కాన్సెప్ట్ బేస్డ్ కథతో.. కంటెంట్ తో వస్తున్నట్లు టీజర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పాడు.
సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోలైనా, చిన్న హీరోలైనా హిట్స్, ప్లాప్స్ చాలా మామూలే. ఆర్ఎక్స్100 మూవీతో మంచి హిట్ అందుకున్న హీరో కార్తికేయ.. ఆ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీకి మరో హీరో దొరికాడని అనిపించుకున్నాడు. కానీ.. ఆ తర్వాత నుండి కథల ఎంపికలోనో.. లేదా వేరే ఏదైనా రీసన్స్ వలనో కార్తికేయ సినిమాలు వరుసగా నిరాశపరుస్తూ వచ్చాయి. ఆర్ఎక్స్100 తర్వాత కార్తికేయ హీరోగా చేసిన హిప్పీ, గుణ369, చావుకబురు చల్లగా, రాజా విక్రమార్క సినిమాలు ప్లాప్ అయ్యాయి. కానీ.. తాను విలన్ గా నటించిన గ్యాంగ్ లీడర్, వలిమై రెండు సినిమాలు తనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొంచం గ్యాప్ తీసుకున్నాడు.
దీంతో అందరూ వరుసగా ప్లాప్స్ పడుతున్నాయనే బ్రేక్ తీసుకున్నాడు. లేదంటే ఇన్నాళ్లు ప్లాప్స్, హిట్స్ పట్టించుకోకుండా చేశాడుగా అని అనుకున్నారు జనాలు. ఈ క్రమంలో కొత్తగా ‘బెదురులంక 2012’ అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగింది. కార్తికేయ కటౌట్ కి ఎవరైనా యాక్షన్ సినిమాలే ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ.. ఈసారి వినూత్నంగా కాన్సెప్ట్ బేస్డ్ కథతో.. కంటెంట్ తో వస్తున్నట్లు టీజర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పాడు. వరుస ప్లాప్స్ తర్వాత తాను బాగా ఆలోచించి.. ఒప్పుకున్న స్క్రిప్ట్ బెదురులంక 2012 అని తెలిపాడు.
ఈ సందర్భంగా కార్తికేయ.. సినిమా టీమ్ గురించి, సినిమాలో విషయం గురించి.. ఆర్టిస్ట్ ల గురించి చాలా మాట్లాడాడు. అలాగే మణిశర్మ తన సినిమాకి మ్యూజిక్ అందించడం ఒక అచీవ్ మెంట్ లా ఉందని అన్నాడు. చివరిగా.. చాలా కష్టపడి లేట్ అయినా సరే సినిమాని జాగ్రత్తగా చేస్తున్నాం. నా పాత సినిమాలలో జరిగిన మిస్టేక్స్ ఇందులో జరగకుండా చూసుకుంటున్నాం. ఈ ఒక్క సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి. తర్వాత నుండి మీరు మెచ్చే సినిమాలు చేస్తాను. ఇది నా ప్రామిస్ అంటూ చెబుతూ తన విన్నపాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం కార్తికేయ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి కార్తికేయ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.