Charandeep: సినీ ఇండస్ట్రీలో నటులంతా ఎన్నో రిస్కులు చేసి క్యారెక్టర్లకు న్యాయం చేస్తుంటారు. ముఖ్యంగా విలన్ రోల్స్ చేసేవారు, నెగటివ్ షేడ్స్ ఉన్నవారు.. ఫైట్స్ కోసం రిస్కులు తీసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అలా షూటింగ్ సమయంలో ఎన్నో గాయాలు, ప్రమాదాలకు గురవుతుంటారు నటులు. తాజాగా ఓ థ్రిల్లర్ మూవీ షూటింగ్ సమయంలో అనుకోని ప్రమాదానికి గురయ్యానని, ఆ టైంలో డైరెక్టర్ నన్ను కాపాడడంటూ చెప్పుకొచ్చాడు నటుడు చరణ్ దీప్.
చరణ్ దీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకూ చాలా సినిమాలలో విలన్ రోల్స్ చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ‘డి బ్లాక్’ అనే తమిళ సినిమాలో విలన్ గా నటించాడు. జూలై 1న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందని.. తన పాత్రకు మంచి పేరు వస్తుందని చరణ్ దీప్ ఓ వీడియోలో తెలిపాడు.
ఈ నేపథ్యంలో డి-బ్లాక్ మూవీ షూటింగ్ టైంలో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నాడు. “చీకట్లో చెరువు దగ్గర సీన్ చేసేటప్పుడు తాను కాలుజారి చెరువులో పడిపోయానని, ఆ టైంలో సినిమా టీమ్ అంతా నేను సీన్ లోనే ఉన్నానని భావించారు. కానీ.. మా డైరెక్టర్ నేను మునిగిపోవడాన్ని గుర్తించి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కాపాడాడు. ఇప్పుడు ఇది నాకు రెండోసారి పుట్టినట్లే భావిస్తున్నాను.” అని చెప్పాడు చరణ్ దీప్. ప్రస్తుతం అయన మాటలు నెట్టింట వైరల్ అవుతోంది. మరి చరణ్ దీప్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.