బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, నాగ చైతన్య కలిసిన నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. అతి దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఇక ఆమిర్ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాకు ఆమిరే నిర్మాత కావడంతో.. సినిమా పరాజయంతో ఇప్పటికే భారీ నష్టాన్ని చవి చూసిన ఈ హీరో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సినిమా నష్టాన్ని భరించేందుకు ముందుకు వచ్చాడు ఆమిర్.
ఈ క్రమంలో తన రెమ్యూనరేషన్ మొత్తం వదులుకునేందుకు రెడీ అయ్యాడు. లాల్ సింగ్ చడ్డా సినిమాకు వచ్చిన భారీ నష్టాలను భర్తీ చేసేందుకు ఆమిర్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మొత్తం బడ్జెట్ రూ.180 కోట్లు కాగా తన రెమ్యూనరేషన్ కింద ఆమిర్ ఖాన్ 50 కోట్ల రూపాయలు వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. నష్టాల్ని భరించే పనిలో భాగంగా ఆ భారీ మొత్తాన్ని వదులుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం ఆమిర్ ఖాన్ సుమారు నాలుగేళ్ల పాటు కష్టపడ్డాడు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఈ నాలుగేళ్లలో ఏ సినిమా కూడా చేయలేదు. ఇన్ని భారీ అంచనాలు పెట్టుకున్న లాల్ సింగ్ చడ్డా సినిమా అతి దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఇప్పటి వరకు రూ.70 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలిసింది. అంటే దాదాపు రూ.100 కోట్ల వరకు నష్టాలు రావడంతో.. తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసి కొంత నష్టాలను తగ్గించేందుకు ఆమిర్ ఖాన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పైగా ఆమిర్ కెరీర్లో 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరని చిత్రంగా లాల్ సింగ్ చడ్డా నిలిచింది. ఇక ఈ సినిమా కోసం ఆమిర్ ఏకంగా నాలుగేళ్లు కష్టపడినా.. దాని నుంచి ఒక్క పైసా కూడా సంపాదించలేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమాను ఆమిర్, ఆయన మాజీ భార్య కిరణ్‌రావ్ కలిసి నిర్మించారు.
హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా లాల్ సింగ్ చడ్డా మూవీకి తెరకెక్కించారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైంది. తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్గా నటించగా.. నాగచైతన్య కీలక పాత్రలో కనిపించాడు. ఇక తెలుగులో చిరంజీవి ఈ సినిమాను సమర్పించగా.. నాగార్జున కూడా ఓ చేయి వేసి ప్రమోషన్స్‌లో పాల్గొనప్పటికి సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. మరి ఆమిర్ ఖాన్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ‘లాల్ సింగ్ చడ్డా’ ఫ్లాప్‌కి కారణం చెప్పిన మాధవన్..
ఇది కూడా చదవండి: బాలీవుడ్లో తొలి సినిమాకే నాగచైతన్య అన్ని కోట్లు తీసుకున్నాడా!