అనంత శ్రీరామ్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అనతి కాలంలోనే సినీ గేయ రచయితగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారాయన. స్టార్ హీరోల సినిమాల్లో అనంత శ్రీరామ్ రాసిన పలు సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. దీంతో ఆయన పాపులర్ లిరిక్ రైటర్‌గా మారారు. అలాంటి అనంత శ్రీరామ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై భట్రాజు కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంత శ్రీరామ్ మీద అనంతపురం ఎస్పీకి వాళ్లు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే.. ఇటీవల పాలకొల్లులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. అక్కడ ఆయన తన ప్రసంగంలో భట్రాజు పొగడ్తలు అంటూ తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భట్రాజు కులస్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్టేజీపై అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఫిర్యాదుకు జత చేశారు. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిందని.. అయినా తమ కులంపై ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారని కంప్లయింట్లో పేర్కొన్నారు. ఇకపోతే, అనంత శ్రీరామ్ గతంలోనూ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఒక పాట విషయంలో దేవతలను విమర్శించేలా రాశారని ఆయనపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి, ఈ మధ్య కాలంలో అనంత శ్రీరామ్ పలు కాంట్రవర్సీల్లో చిక్కుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.