777 Charlie: ఇటీవల కాలంలో చిత్రపరిశ్రమతో పాటు సినిమాల విడుదలలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. చిన్న సినిమా నుండి పెద్ద సినిమాల వరకూ అన్నీ థియేట్రికల్ రిలీజ్ అయిన కొద్దిరోజులకే ఓటిటి బాటపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పడిపోయింది. ఇక థియేటర్లలో విడుదలైన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తాయా? అని వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.
గతవారం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమా ‘777 చార్లీ’. కన్నడ భాషలో రూపొందిన ఈ సినిమా.. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైంది. చార్లీ అనే కుక్కకు, మనిషికి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ని చూపిస్తూ.. ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు కిరణ్ రాజ్. అయితే.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న చార్లీ సినిమా చూసి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సైతం కంటతడి పెట్టుకున్న విషయం విదితమే.
ఈ క్రమంలో చార్లీ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చార్లీ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే.. రిలీజ్ ఎప్పుడనేది ఇంకా సమాచారం లేదు. కానీ.. ఆగష్టు నెలలో స్ట్రీమింగ్ కానుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో కిరాక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూనే.. జిఎస్ గుప్తతో కలిసి సినీనిర్మాణంలో భాగమయ్యాడు. మరి 777 చార్లీ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.