బాక్సాఫీస్ వద్ద దసరా సినిమాల సందడి ముగిసి.. దీపావళికి రాబోయే కొత్త సినిమాల జోరు మొదలైంది. దీపావళికి ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, సినీ ప్రేక్షకులంతా కొత్త సినిమాల రిలీజుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దీపావళికి స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకూ అందరి సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీపడుతున్నాయి. అదీగాక స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతుండటం విశేషం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు కంటెంట్ ప్రధానంగా మాత్రమే థియేటర్స్ లో ఆడుతున్నాయి. కంటెంట్ కొత్తగా లేకపోయినా, పాత సినిమాల తాలూకు లక్షణాలు పుష్కలంగా కనిపించినా ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయి.
ఇలాంటి తరుణంలో ఈ దీపావళికి తెలుగు రాష్ట్రాలలో చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కాబోతున్నాయి. అయితే.. ఓటిటిలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులు.. అటు థియేట్రికల్ సినిమాలను, ఓటిటి సినిమాలను ఒకేలా చూస్తున్నారు. ఎందుకంటే.. సినిమాలు థియేటర్స్ లో విడుదలైనా.. ఓటిటిలోకి ఎప్పుడొస్తుందా అని అడుగుతున్న రోజులివి. సో.. దీపావళికి ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు పలు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. చూడాలి దీపావళికి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ జరగబోతుందో.. ఎన్ని సినిమాలు నిలబడతాయోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఆరు సినిమాలతో పాటు బాక్సాఫీస్ వద్ద మరికొన్ని చిన్న సినిమాలు సైతం విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ఆరు సినిమాలైతే అధికారికంగా రిలీజ్ డేట్స్ ప్రకటించాయి. అదే విధంగా రిలీజ్ ప్రమోషన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాయి. అయితే.. ఈ ఆరు సినిమాలలో స్ట్రెయిట్ తెలుగు మూవీ.. జిన్నా ఒక్కటే ఉండటం విశేషం. మిగతావన్నీ రీమేక్, డబ్బింగ్ సినిమాలే. కాబట్టి.. ఏయే సినిమాలు తమ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తాయో.. థియేటర్లకు జనాలను రప్పిస్తాయో చూడాల్సి ఉంది. మరి ఈ దీపావళికి రిలీజ్ అవుతున్న సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.