బహు భాషా హీరోయిన్ త్రిష కృష్ణన్ పుట్టిన రోజు నేడు. ఆమె సినిమాల్లోకి రాకముందు ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్నారు. విజయాలు సాధించారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్టార్ హీరోయిన్ అయ్యారు.
ఇండస్ట్రీలో 10 ఏళ్లకు మించి హీరోయిన్‌గా కొనసాగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో త్రిష కృష్ణన్ ఒకరు. 1999లో జోడి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా త్రిష తన యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేశారు. 2002లో సూర్య హీరోగా వచ్చిన ‘మౌనం పేసుదే’తో హీరోయిన్‌గా మారారు. దాదాపు 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగటమే కాదు.. ఇప్పటికీ హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే ఉన్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. మునుపటి కంటే ఇప్పుడు అవకాశాలు తగ్గినా.. హీరోయిన్‌గా ఔట్ డేట్ అయిపోలేదు. సంవత్సరానికి రెండు,మూడు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. తాజాగా, ఆమె నటించిన ‘పొన్నియన్ సెల్వన్2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపుగా 20 ఏళ్లకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న గ్లామర్ బ్యూటీ త్రిష పుట్టిన రోజు నేడే. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన 10 ఆసక్తికర విషయాలు మీకోసం..