భూలోక స్వర్గమైన వెనీస్ … ఎందుకు దెయ్యాల దిబ్బగా మారబోతోందీ!?.

వెనిస్ ఇటలీ దేశంలో ఒక నగరం పేరు. ఇది నీటిపై తేలియాడే నగరంగా  ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరాలలో ఒకటగా వెనిస్ పేరు పొందింది. వెనిస్ నగరం ఏడ్రియాటిక్ సముద్రంలో 118 చిన్న దీవుల, వెనీషియన్ లాగూన్ యొక్క సముదాయం. ఈ లాగూన్ దక్షిణాన పో, ఉత్తరాన పియావె అనే నదుల మధ్య విస్తరించి ఉంది.   13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం చివరి వరకు ఇది కళలకు కేంద్రంగా వర్ధిల్లింది. అయితే అంత అందమైన నగరమూ త్వరలో దెయ్యాల దిబ్బగా మారబోతోందని పూరీ మ్యూజింగ్స్ ద్వారా నగర చరిత్ర గురించి వివరించారు. ఈ భూమ్మీద ఉన్న సుందరమైన నగరం ఇటలీలోని వెనిస్‌ అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. వెనిస్‌ అందాలు, అక్కడి జీవన స్థితిగతుల గురించి తాజాగా ఆయన వివరించారు. అత్యంత అందమైన ప్రాంతంగా చెప్పుకునే ఈ వెనిస్‌ నగరం 2030 నాటికి ఘోస్ట్‌ సిటీగా మారనుందని అందరూ అనుకుంటున్నారని ఆయన తెలిపారు. ఒకవేళ అవకాశం వస్తే వెనిస్‌ అందాలు చూడడానికి వెళ్లాలని సూచించారు. ఒక పురాణ నగరం, ఒక ముత్య నగరం, ఒక కల నగరం, జ్ఞాపకాలు నివసించే నగరం.

వెనిస్‌ను ఇటలీలో అత్యంత శృంగార నగరం అని పిలుస్తారు. ప్రపంచ ప్రేమికులందరూ దీనిని సందర్శించాలని కోరుకుంటారు. వెనిస్‌ నివాసులు చురుకుగా ఓడలను నిర్మించడం ప్రారంభించారు. త్వరలో వెనీషియన్ వ్యాపారులు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యాన్ని అభివృద్ధి చేశారు. నగరం కాలువలతో అనుసంధానించబడిన 118 ద్వీపాలలో ఉంది, దీని ద్వారా 400 కంటే ఎక్కువ పెద్ద మరియు చిన్న వంతెనలు విసిరివేయబడ్డాయి. 9-12 శతాబ్ధాల మధ్య కాలంలో వెనిస్ నగరంగానూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన యూనియన్ ప్రదేశంగానూ అభివృద్ధి చెందింది. వెనిస్‌ అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారడం వల్ల ప్రతి ఇల్లు కూడా హోటల్‌గానో రెస్టారెంట్‌గానో మారిపోయింది.  దీంతో పర్యాటకాన్ని ఆపేయమని గతేడాది చాలామంది స్థానికులు గొడవలు కూడా చేశారు.  వీలైతే మాత్రం వెనిస్‌ ఒక్కసారి వెళ్లి చూసి రండి. భూమ్మీద ఉన్న అందమైన నగరమదే’ అని పూరీ వివరించారు. ప్రపంచంలోనే మొదటి కాసినో ఇక్కడే పెట్టారని, మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఇక్కడామేనని చెప్పారు. 1646లో ఆమె డిగ్రీ పూర్తి చేసిందన్నారు. ఇక, అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారడంతో ప్రతి ఇల్లూ హోటల్ గానో లేదా రెస్టారెంట్ గానో మారిందని, దాని వల్ల స్థానికులకు ఇళ్లు అద్దెకు దొరకడం కష్టమైందని వివరించారు. ఒకప్పుడు లక్షా 20 వేలున్న జనాభా ఇప్పుడు 60 వేలకు పడిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ నగరం నీటిలో మునిగిపోతోందని, 2030 నాటికి దెయ్యాల నగరంగా మారుతుందని అందరూ చెప్పుకొంటున్నారని అన్నారు.

 

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest travelNewsTelugu News LIVE Updates on SumanTV