ఉరుకుల పరుగుల జీవితం.. నిద్ర లేచిన దగ్గరి నుంచి గమ్యాలు, గోల్స్ అంటూ ఒత్తిడి.. ఆఫీస్ కెళ్తే వర్క్ ప్రెజర్. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేవే. రోజు మొత్తంలో కాసేపు అయినా అవన్నీ మర్చిపోయి హాయిగా గడపాలి అని ఉంటుంది. అందుకు చాలా మార్గాలు ఉన్నాయి. కొందరు పెట్స్ పెంచుకుంటారు. కొందరు ఆటలు ఆడుతుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో మునిగి తేలుతుంటారు. కానీ, ఒంటరిగా ఉన్న మీ జీవితానికి ఒక తోడు కావాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? తల్లిందండ్రులు, మిత్రులు, సన్నిహితులు చాలా మందే ఉంటారు. కానీ, అన్నీ అందరికీ చెప్పుకోలేము. మీ లైఫ్లో ప్రతి విషయాన్ని పంచుకునేందుకు మీకు ఒక తోడు కావాలి. మీ బాధని చెప్పుకోవడానికి, మీ ఆనందాన్ని పంచుకోవడానికి, మీ కష్టాల్లో తోడుగా నేనున్నానే భరోసా ఇవ్వడానికి.
చాలా మందికి అలాంటి తోడు లేకనే లైఫ్లో విజయాన్ని సాధించలేకపోతున్నారు. కొందరికి ఆ విషయం తెలిసినా, వారి జీవితంలో ఒక భాగస్వామి కావాలనే కోరిక ఉన్నా కూడా.. ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే అమ్మాయిలని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక. పెళ్లిచూపులకు వెళ్తే అమ్మాయిని ఎలా మెప్పించాలో అర్థంగాక. అందివచ్చిన ఎన్నో అవకాశాలను జేజార్చుకుంటున్నారు. అందరు అనుకునేలా.. అమ్మాయిలు అంతా అందాన్ని, డబ్బునే కోరుకోరు. వారికంటూ కొన్ని కోరికలు ఉంటాయి. వారు చేసుకోబోయే వ్యక్తి, వారు ఇష్టపడే వ్యక్తిలో ఫలానా లక్షణాలు, క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటారు. అమ్మాయిలు అంతా కోరుకునే జనరల్ లక్షణాలు ఒక 5 ఉన్నాయి. మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.
అవును మీరు చదివింది కరెక్టే అమ్మాయిలు ఇష్టపడాలంటే ముందు మీరు ధైర్యవంతులు అయి ఉండాలి. ఏ సందర్భం అయినా, ఏ కష్టమైనా, ఎలాంటి పరిస్థితిని అయినా మీరు ఎదుర్కోగలరనే నమ్మకం వారికి కలగాలి. మీరు ఒక ధైర్యవంతుడని.. మీతో ఉంటే వారికి ఎలాంటి భయం ఉండదనే నమ్మకాన్ని మీరు కలిగించగలగాలి. అలాంటి అబ్బాయిని అమ్మాయిలు త్వరగా ఇష్టపడతారు. అంతేకాకుండా వదులుకునేందుకు అస్సలు ఇష్టపడరు.
సమయస్ఫూర్తి.. దీనినే మనం ఇప్పుడు స్పాంటినిటీ అని కూడా అంటుంటాం. ఏ అమ్మాయికి అయినా అబ్బాయి ఎప్పుడూ కోపంగా, ఏదో గిరి గీసుకుని ఉంటే నచ్చదు. అబ్బాయి అనేవాడు కాస్త జోవియల్గా ఉండాలి. అప్పుడప్పుడు పంచులు వేస్తూ వారిని నవ్వించాలి. ఇతనితో నాకు అస్సలు టైమ్ తెలియదు అని వాళ్లు ఫీలయ్యేలా చేయాలి. ఎంత కష్టం ఉన్నా అతనితో ఉంటే నేను అది మర్చిపోయి హాయిగా నవ్వుకోగలను అనే అభిప్రాయాన్ని మీరు ఏర్పరుచుకోగలగాలి. నవ్వించే అబ్బాయికి అమ్మాయిలు త్వరగా కనెక్ట్ అవుతారు.
అబ్బాయి ధైర్వవంతుడు అయి ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి అని ఎలా కోరుకుంటారో.. అలాగే తెలివైన వాడు కావాలని కోరుకుంటారు. తాము ఇష్టపడే అబ్బాయి మరీ దద్దిగా ఉంటే వాళ్లకు నచ్చదు. కాస్త తెలివైన వాడు అయి ఉండాలని కోరుకుంటారు. పరిస్థితులను చక్కదిద్దగల వ్యక్తి అవ్వాలని ఆశ పడుతుంటారు.
ఏ లక్షణం ఉన్నా లేకపోయినా ఈ లక్షణం మాత్రం తప్పకుండా ఉండాలి. ఒక్క అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం కోసమే కాదు. లైఫ్లో సక్సెస్ అవ్వాలి అన్నా కూడా మీలో నిజాయితీ ఉండాలి. ఎవరితోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలగాలి. తప్పుని తప్పని, ఒప్పుని ఒప్పని చెప్పగలగాలి. మీరు తప్పు చేసినా కూడా దానిని నిజాయితీగా, నిర్భయంగా ఒప్పుకోవాలి. అలా నిజాయితీగా ఉండే అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు మిస్ చేసుకోరు. నిజాయితీగా ఉండే అబ్బాయిలనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.
అమ్మాయిలు, స్త్రీలు, అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ, మీ ఫ్రెండ్, కొలీగ్ ఇలా ఎవరికైనా మీరు గౌరవం ఇవ్వాలి. స్త్రీలు, అమ్మాయిలు వారికంటూ సముచిత స్థానాన్ని, ఒక గౌరవాన్ని కోరుకుంటారు. ప్రతి విషయంలో వారికి అవకాశం కల్పించడం, వారి అభిప్రాయాలను వినడం, వారికి కూడా మాట్లాడే అవకాశం కల్పించడం అనేది చాలా ముఖ్యం. వాళ్లు చేసే పనిని మెచ్చుకోవడం. తప్పుచేస్తే సర్దిచెప్పడం చేయాలి. వారిని వారిలా గౌరవించే అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. ఈ 5 లక్షణాలు మీలో ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారు. అలాంటి లక్షణాలు మీలో ఉన్నాయనే విషయం ఎదుటివారికి కూడా తెలియాలి. అలా మిమ్మల్ని మీరు మార్చుకుంటే తప్పకుండా మీకు మంచి జీవిత భాగస్వామి దొరకచ్చు.