మనుషుల మనస్తత్వం వారు పుట్టిన వారాన్ని బట్టి కూడా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం పుట్టిన వాళ్లు గొప్ప వ్యక్తులు అవుతారు. శనివారం పుట్టడం ఓ గొప్ప వరం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనుషుల సైకాలజీ వారు పుట్టిన వారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కో వారంలో పుట్టిన వారి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. శనివారం పుట్టిన వారి మనస్తత్వం గురించి జ్యోతిష్య రత్న కేవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ.. ‘‘శనివారం పుట్టిన వారిపై శనీశ్వరుడు ఆధిపత్యం వహిస్తాడు. సహజంగా శనివారం పుట్టిన వాళ్లు చాలా చురుగ్గా ఉంటారు. కానీ, పనిలో కొంత నెమ్మదిపాటు ఉంటుంది. అయినా కూడా వీరి పనిని వంక పెట్టాల్సిన పని లేదు. ఏ రంగంలో పనిచేసినా.. వీరు గొప్ప నైపుణ్యత కలిగి ఉంటారు. వీరు చేసే ప్రతి పనికి ఎవరో ఒకరి అండదండలు ఉంటాయి. వీళ్లు ఏమీ తెలియకపోయినా..
తెలుసుకుని చేస్తారు. నాకు రాదు.. నా వల్ల కాదు అనే మాట వీరి నోటినుంచి రాదు. ఎదుటి వ్యక్తులనుంచి తమకు కావాల్సింది ఎలా రాబట్టుకోవాలో వీరికి బాగా తెలుసు. వీరి పని మాట్లాడుతుంది కానీ, నోరు మాట్లాడదు. సినిమా రంగంలో పుట్టిన చాలా మంది శనివారం పుట్టిన వాళ్లే ఉంటారు. వీరి మనసు చాలా సున్నితమైనది. వీరు అందరి చేత గౌరవింపబడతారు. అతిగా మాట్లాడరు. పోలీసు శాఖలో శనివారం పుట్టిన వాళ్లు ఉంటే.. వాళ్లు కేసును సాల్వ్ చేయటంలో బెస్ట్ అవుతారు. ఇట్టే కేసును సాల్వ్ చేస్తారు. వీరిది కష్టపడే తత్వం. వీరికి వ్యవసాయ రంగం అంటే చాలా ఇష్టం. వీళ్లు డబ్బు కోసం పని చేసే వాళ్లు కాదు..
వ్యక్తిత్వం ఉన్న వాళ్లు.. వీరికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. పనిని ధైవంగా భావిస్తారు. ఎగ్జిట్ పోల్స్‌లో వీళ్లు చెప్పింది జరిగే అవకాశం చాలా ఎక్కువ. శనివారం పుట్టడం గొప్ప వరం.. బద్ధకం పక్కన పెట్టి.. అత్యాశకు పోకుండా ఉంటే వీళ్లంత సక్సెస్ ఉన్న వాళ్లు ఎవరూ లేరు. శనివారం పుట్టిన స్త్రీ, పురుషులు ఎవ్వరైనా ఆంజనేయ స్వామిని పూజించాలి. ప్రతి నిత్యం సింధూరం ధరించాలి. కనీసం శనివారం అయినా సింధూరం ధరిస్తే.. విజయాలు నల్లేరు మీద నడకలా ఉంటాయి. శనివారం రోజు శ్రీరామ, జయరామ జయ జయ రామ అని 27 సార్లు అంటే మంచి జరుగుతుంది’’ అని అన్నారు. మరి, శనివారం పుట్టిన వారి సైకాలజీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.