ఈ మధ్యకాలంలో సెల్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. తద్వారా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా సెల్‌ఫోన్ కాపురాలను కూల్చేస్తోంది. కొంతమంది ప్రైవేట్ టైంలో కూడా సెల్‌ఫోన్ వాడుతున్నారు. ముఖ్యంగా మగవాళ్లు. భార్య బెడ్రూమలోకి వచ్చినా వారిని పట్టించుకోకుండా సెల్‌ఫోన్ వాడుతున్నారు. దీంతో భార్య పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళలు పక్కచూపులు చూడటానికి భర్త సెల్‌ఫోన్ అతి వాడకం కూడా కారణం అని లైఫ్ కోచ్, ఫ్యామిలీ కన్సల్టెంట్ ప్రియా చౌదరి తెలిపారు. బెడ్రూములో భర్త ప్రవర్తన గురించి ఓ మహిళ చెప్పిన విషయాలను తెలియజేస్తూ.. ‘‘ నేను పదింటికల్లా పని మొత్తం చేసుకుని బెడ్రూములోకి వెళ్లిపోతాను మేడమ్. ఈ పెద్ద మనిషి సెల్‌ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు.
అది ఒంటి గంట అవుతుందో తెలియదు, తెల్లవారుజాము అవుతుందో తెలీదు. తెల్లవారు జామున.. అప్పుడు తనకు కావాలనుకున్నప్పుడు మాత్రమే నేను ప్రిపేర్ అయిఉండాలి. ఇదెలా సాధ్యం అవుతుంది. నేను తనతో పాటు అలిసిపోయి ఉంటా. నాకు కావాల్సి వచ్చినపుడు అతడు మాత్రం తన ఆనందాన్ని సెల్‌ఫోన్ వెతుక్కుంటాడు. తనకు కావాల్సినపుడు నేను గాఢ నిద్రలో ఉన్నా.. నన్ను తట్టిలేపి తన కోరిక తీర్చుకుంటాడు’’ అని ఆ మహిళ చెప్పింది. ఇది కూడా భార్యాభర్తల మధ్య ఎడబాటు రావటానికి ఓ కారణం. బలవంతంగా తీసుకున్నా.. అడిగినప్పుడు ఇవ్వకపోయినా తప్పు. ఇది చాలా సున్నితం. మగాడు దాన్ని ఓ హక్కు అనుకుంటాడు. ఆమె కూడా ప్రిపేర్ అయి ఉండాలి కదా.. అది ఎందుకు ఆలోచించరు.
ఆమె కూడా ఓ మనిషే అది ఆలోచించండి. సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత అన్నింటిని చంపేసింది. ఇప్పుడు ఫోన్లో వెతుక్కుంటున్నవన్నీ గాసిప్సే కదా.. ఆయన పక్కింటి ముచ్చట్లు ఫోన్లో వెతుక్కుంటే.. ఆమె పక్కింటి పరిచయాలు వెతుక్కుంటుంది. ఒకనాటి పరిస్థితులు వేరు. ఇప్పుడు కలియుగం. స్త్రీ కొంత స్వేచ్ఛను కోరుకుంటోంది. మీరు ఆ స్వేచ్ఛను ఇవ్వండి. దానికి కాపలాదారుడిగా ఉండండి. ఆమెకు సెక్కూరిటీ గార్డుగా ఉండండి. డిక్టేటర్‌గా మాత్రం కాదు. ఇలా చేస్తేనే పరిస్థితులు మారతాయి. గౌరవం దక్కకపోవటం, కోర్కెలు తీర్చకపోవటం, వీలైనంత సమయం కేటాయించకపోవటం వంటివి ఉండకూడదు. అన్ని విషయాల్లో భార్యను విమర్శించకూడదు. సంబంధాలు పెట్టుకున్న భార్యను కూర్చోబెట్టి మాట్లాడండి. వారిని మీ దారిలోకి తీసుకురండి. వాళ్లు కచ్చితంగా మారతారు’’ అని అన్నారు.