భార్యాభర్తల బంధం ఎలాంటి ఆటుపోట్లు లేకుండా కొనసాగాలంటే కనీసం ఒకరిలోనైనా అర్థం చేసుకునే గుణం ఉండాలి. భరించేవాడు భర్త అని పెద్దలు అన్నారు కాబట్టి.. మగవారు భార్య విషయంలో కొంత తగ్గి ప్రవర్తిస్తే మంచిది. ఎందుకంటే.. స్త్రీల మనస్తత్వం పురుషులతో పోల్చుకుంటే కొంత విచిత్రంగా ఉంటుంది. దానికి తోడు కుటుంబం, పిల్లల బాధ్యతల కారణంగా వారిలో కొంత అసహనం ఉండనే ఉంటుంది. అందుకే కొన్ని విషయాల్లో స్వేచ్ఛను కోరుకుంటారు. మరికొన్ని విషయాల్లో తమదే పైచెయ్యి కావాలని అనుకుంటారు. ఇందులో వ్యక్తిగత స్వార్థం ఏమీ ఉండదు. కుటుంబ సంక్షేమం గురించే ఎక్కువ ఆలోచిస్తారు.
ముఖ్యంగా ఓ ఐదు విషయాల్లో భార్యలను తృప్తి పర్చటం భర్త వల్ల కాదు. అవేంటంటే.. 1) బంగారం, ఇంట్లో వస్తువులు, చీరల విషయంలో వారిని సంతృప్తిపర్చటం చాలా కష్టం. ఎన్ని కొన్నా కూడా కొంతమంది భార్యలకు అవి సరిపోవు. ఇంకా కావాలని అంటుంటారు. 2) ఔటింగ్స్, షాపింగ్స్‌కు ఎన్నిసార్లు తీసుకుని పోయినా వాళ్లు ఇంకా కోరుకుంటూనే ఉంటారు. అది కూడా భర్తతో కాస్త ఎక్కువ సమయం గడపాలనే నిస్వార్థమైన స్వార్ధమే తప్ప మరొకటి కాదు. 3) భార్య సైడు పుట్టింటి వారి గురించి భర్తలు తీసుకునే శ్రద్ధ విషయంలో వారిని అస్సలు తృప్తి పర్చలేము. భర్తలు అత్తింటి వారితో బాగానే ఉన్నా.. ఏ చిన్న తప్పు కనబడ్డా ఇట్టే కోపం వచ్చేస్తుంది.
ఏదో పరధ్యానంలో ఉండి అత్తింటివారిని పలకరించకపోయినా వాళ్లు హర్ట్ అవుతారు. కాబట్టి ఎల్లప్పడూ జాగ్రత్తగా ఉండాలి. 4) వారికి నచ్చని వస్తువులు ఎన్ని తెచ్చి ఇచ్చినా.. ఎంత ఖరీదువి తెచ్చి ఇచ్చినా వారు సంతృప్తి చెందరు. వారికి నచ్చినవి తెచ్చి ఇస్తేనే సంతోషిస్తారు. అది చిన్న వస్తువైనా సరే. 4) శృంగారం విషయంలోనూ వారిని సంతృప్తి పర్చడం చాలా కష్టం. ఎందుకంటే శృంగారం విషయంలో మగవారికి, ఆడవారికి తేడాలు ఉంటాయి. సంతృప్తి చెందే విషయంలోనూ తేడాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రేమలేని శృంగారాన్ని వాళ్లు అస్సలు భరించలేరు.