పెళ్లయిన జంట మధ్య ఆ సుఖం అనేది టూ వే ప్రాసెస్ లాగా ఉండాలి. ఇద్దరూ సంతోషాన్ని ఇచ్చి, పుచ్చుకోగలగాలి. అలా కాకపోతే జీవితం ఇబ్బందుల పాలవుతుంది. తర్వాతి కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుంది. ఎప్పుడూ ఒకరు మాత్రమే ఆనందాన్ని పొందుతుంటే.. వారి భాగస్వామికి బోర్‌కొడుతుంది. తర్వాతి కాలంలో వారు చికాకు పడే పరిస్థితి వస్తుంది. అలా కాకూడదంటే.. ఎదుటి వ్యక్తికి బోర్ కొట్టకుండా చూసుకోవాలి. అది ఇద్దరూ ఆడగలిగే ఓ అందమైన ఆటలా మార్చేయాలి. ఇందుకోసం కొన్ని పద్దతుల్ని పాటించాలి.
1) బహుమతులతో మచ్చిక చేసుకోండి!
బహుమతులు అంటే ఏవైనా వస్తువులు అనుకునేరు. అవి కావు. మీ పార్ట్‌నర్ మీకు నచ్చిన పని చేసిన ప్రతీసారి వారికి ఓ బహుమతి ఇవ్వండి. అది కూడా వారిని రెచ్చగొట్టేలా ఉండాలి. ముద్దులతో ముంచేయటం, కౌగిలిలో గట్టిగా బంధించేయటం లాంటి వన్నమాట..
2) మసాజ్‌తో మెప్పించండి!
ఇద్దరూ భావప్రాప్తి పొందాలంటే.. జరిగే ప్రక్రియను ఇద్దరూ ఆనందించగలగాలి. ఎదుటి వ్యక్తికిమరింత మూడ్‌ను రప్పించేందుకు మసాజ్ చేయటం అన్నది మంచిగా పని చేస్తుంది. శరీరం రిలాక్స్ అవ్వటంతో పాటు.. ఆ పని కోసం శరీరాన్ని మరింత సన్నద్ధం చేస్తుంది. మసాజ్‌లో కూడా ఓ పద్దతిని పాటించి చేయాలి.
3) హస్త ప్రయోగం..
హస్త ప్రయోగం తప్పని చాలా మంది భావిస్తుంటారు. కానీ, అది నూటికి నూరు పాళ్లు తప్పు. సమయంలో మీ భాగస్వామిని రెచ్చగొట్టటానికి, వారికి ఆసక్తి కలిగించటానికి సరైన విధంగా చేసుకోవటం ఉపయోగపడుతుంది.
4) కలిసి కామసూత్ర చదవండి!
వేల ఏళ్ల క్రితం వాత్సాయనుడు రాసిన కామసూత్ర అన్ని శృంగార సమస్యలకు పరిస్కారం చూపిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కామసూత్ర పుస్తకాన్ని చదవటం చాలా ఉపయోగపడుతుంది. అందులోని భంగిమలను ట్రై చేయటం ద్వారా మరింత అనుభవాన్ని పొందొచ్చు. విడివిడిగా చదివితే రాని అనుభూతి కలిసి చదవటం ద్వారా వస్తుంది.