శృంగారం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ అనుభూతిని చాలా మంది ఆస్వాదించలేకపోతున్నారు. రకరకాల కారణాల వల్ల.. ప్రయాణం వల్ల ఒత్తిడి కావచ్చు, లేదా ఇంకేమైనా ఇతర సమస్యల వల్ల కావచ్చు.. ఏదైనా గానీ శృంగారాన్ని సరిగా ఆస్వాదించలేకపోతున్నారు. శృంగారాన్ని బూతు పదంలా చూడడం వల్ల దాని మీద సరైన అవగాహన లేక చాలా మంది లైంగిక జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. శృంగారం అంటే అదొక మహా సముద్రంగా భావించడం, ఆ మహా సముద్రంలో మనం ఈదలేమేమో అని చాలా మంది భయపడిపోతుంటారు.
గజ ఈతగాళ్లు అయితేనే ఈదగలరు, మనం కూడా గజ ఈతగాళ్లు అవ్వాలని చెప్పి.. కొంతమంది శృంగార పుస్తకాలు చదవడం.. లేదా శృంగార సంబంధిత వీడియోలు చూడడం వంటివి చేస్తుంటారు. దాని వల్ల కొంత ఉపయోగం ఉన్నా.. దానికి బానిసైతే శృంగార జీవితం దెబ్బ తింటుంది. శృంగార జీవితంలో లైంగికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. అకాల స్ఖలనం, అంగస్తంభన లోపం, నరాల సమస్యలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. దీని కోసం సంబంధిత డాక్టర్ ని సంప్రదించాలి. ఈ సమస్యలు ఉంటే లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేరు. సంబంధిత వైద్యుడ్ని కలిసి చెకప్ లు చేయించుకుని.. మందులు వాడాలి. అయితే అప్పటికీ శృంగార పరమైన సమస్యలు అంటే శృంగారంలో భాగస్వామిని తృప్తిపరచలేకపోతే సైకియాట్రిస్ట్ ని కలవాల్సి ఉంటుంది.
లైంగిక పరమైన సమస్యలు లేకపోయినా కూడా శృంగారంలో వెలితి ఉంటుందని అనిపిస్తే కూడా సైకియాట్రిస్ట్ ని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ వెలితి కారణం డిప్రెషన్, ఆందోళన. శృంగారంలో ఉన్నప్పుడు భయపడితే డిప్రెషన్ లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. నేను చేయలేకపోతున్నాను అని ఆందోళన చెందడం, డిప్రెషన్ కి గురవ్వడం వంటివి కూడా లైంగిక ఆసక్తిని తగ్గిస్తాయి. అందుకే మగాళ్లు శృంగారంలో ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఏ రంగంలో అయినా సరే రాణించాలంటే ఆత్మస్థైర్యం ఉండాలి. ఆత్మస్థైర్యాన్ని మించిన ఆయుధం లేదు. ఆత్మస్థైర్యం లేకుండా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంతమంది సైకాలజిస్ట్ లని కలిసినా ఉపయోగం ఉండదు.
టాబ్లెట్, ఇంజక్షన్ కి తగ్గే జబ్బులన్నా మానసికంగా దృఢంగా ఉంటేనే తగ్గుతాయి. తగ్గదేమో అన్న భయంతో ఉంటే ఎంత పెద్ద డాక్టర్ అయినా ఆ జబ్బుని తగ్గించలేరు. ఆశ క్యాన్సర్ ఉన్నోడిని కూడా బతికిస్తుంది, భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది. శృంగారంలో అస్సలు భయం ఉండకూడదు. భాగస్వామిని తృప్తిపరచలేనేమో అన్న సంకోచం వద్దు. డిప్రెషన్, ఆందోళన వల్ల లైంగిక ఆసక్తి తగ్గడం లేదా.. శృంగారంలో భాగస్వామికి న్యాయం చేయలేకపోవడం వంటివి జరుగుతాయి. ఒకవేళ మీకు డిప్రెషన్, ఆందోళన ఉందని మీకు అనిపిస్తే సైకియాట్రిస్ట్ ని సంప్రదించవచ్చు. అలా కాకుండా ఇతర లైంగిక సమస్యలు ఉంటే మాత్రం సంబంధిత డాక్టర్ ని సంప్రదించాలి. దీని గురించి పూర్తి అవగాహన కోసం కింద ఉన్న వీడియోని చూడగలరు.