ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందులోనూ టాటా లాంటి కంపెనీలో జాబ్ అంటే కళ్ళు మూసుకుని చేరవచ్చు. మీరు కూడా ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ ఉద్యోగం మీ కోసమే. అనుభవం అవసరం లేదు. మీలో నేర్చుకోవాలన్న తపన ఉంటే కంపెనీనే మీకు శిక్షణ ఇచ్చి జాబ్ ఇస్తుంది. శిక్షణ కాలంలో నెలకు రూ. 30 వేలు ఉపకారవేతనం ఇస్తుంది.
దేశంలో అత్యంత ఉన్నత విలువలు కలిగిన టాటా గ్రూప్ సంస్థకు చెందిన టాటా స్టీల్ కంపెనీలో ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోరుతూ ప్రకటన విడుదల అయ్యింది. టాటా స్టీల్ వారికి కావాల్సిన అర్హతలు ఉండి ఎంపికైన అభ్యర్థులను ఏడాది పాటు ఇంజనీర్ ట్రైనీగా అపాయింట్ చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు రూ. 30 వేలు ఉపకారవేతనం చెల్లిస్తారు. శిక్షణ పూర్తయ్యాక ఏడాదికి రూ. 6.24 లక్షలు జీతం చెల్లిస్తారు. అంటే ఏడాదికి రూ. 52 వేలు చెల్లిస్తారు. ఈ ఉద్యోగానికి అనుభవం అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్నాక ఎంపికైతే వారే వారికి తగ్గట్టు శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు. మరి ఈ ఉద్యోగానికి కావాల్సిన కనీస అర్హతలు ఏంటి? వయసు పరిమితి ఎంత ఉండాలి? వంటి వివరాలు మీ కోసం.