ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 7500 పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ నోటిఫికేషన్ 2023 కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, న్యాయస్థానాలు వంటి వాటిలో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకై కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2023 నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7500 పోస్టులను భర్తీ చేయనుంది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వంటి పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హతలు ఏమిటి? జీతం ఎంత? వంటి వివరాలు మీ కోసం.