టెన్త్ పాసయ్యారా? అయితే ఈ రైల్వే ఉద్యోగాలు మీ కోసమే. భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో.. 1785 అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, కేబుల్ జాయింటర్ వంటి పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లోని పలు వర్క్ షాప్స్ లో ట్రైనింగ్ ఇవ్వనుంది. ఖరగ్పూర్ వర్క్ షాప్ లో 360, సిగ్నల్ & టెలికాం వర్క్ షాప్ లో 87, ట్రాక్ మెషిన్ వర్క్ షాప్ లో 120, క్యారేజ్ వాగన్ డిపోలో 121, సినిలో ఉన్న ఇంజనీరింగ్ వర్క్ షాప్ లో 100 ఇలా పలు రకాల వర్క్ షాప్స్ లో మొత్తం 1785 పోస్టులు పడ్డాయి. యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల వారీగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్ చెల్లిస్తారు.