భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఇంటర్ అర్హతగా నిర్ణయించారు. అవివాహిత పురుషులు, అవివాహిత మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఖాళీల భర్తీకి సంబంధించి https://agnipathvayu.cdac.in/AV/ వెబ్సైట్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు విధానం, ఎంపిక పక్రియ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు చూద్దాం..
అగ్నివీర్ వాయు నియామకాల భర్తీ మూడు దశల్లో ఉంటుంది. మొదట దశలో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు ఫేజ్ 2 కు అర్హత సాధిస్తారు. ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు చివరగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారు అగ్నివీరులుగా ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన అభర్ధులు 4 ఏళ్ల పాటు దేశానికి సేవ చేస్తారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్: అగ్నివీర్ వాయు (01/ 2023) బ్యాచ్
అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2)/ మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా/ తత్సమాన ఉత్తీర్ణత.
వయో పరిమితి: దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయస్సు 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఫేజ్-1(ఆన్లైన్ రాత పరీక్ష), ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఏటీ-1, ఏటీ-2 టెస్ట్), ఫేజ్-3(మెడికల్ ఫిట్నెస్ టెస్ట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 2022, నవంబర్ మొదటి/రెండవ వారంలో.
అగ్నివీర్ పరీక్ష తేదీ: జనవరి/ఫిబ్రవరి 2023
ఈ పోస్టులకు నవంబరు మొదటివారంలో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది జనవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన అభర్ధులు భారత వాయుసేనలో నాలుగేళ్ళ పాటు దేశానికి సేవ చేయాల్సి ఉంటుంది.