మీరు మెట్రో ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారా! అయితే మీకో గుడ్ న్యూస్. 9 రకాల ఉద్యోగాల భర్తీ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ దరఖాస్తు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
నిరుద్యోగులకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మెట్రోలో ఖాళీగా ఉన్నటువంటి 9 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 46 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హతలేంటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? జీతాలు ఎలా ఉంటాయి..? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు: 46
విభాగాలు:
విద్యార్థతలు: పోస్టులను అనుసరించి డిప్లొమా, ఐటిఐ, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు చేయు విధానం: అర్హత, ఆసక్తి గల అభర్ధులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా https://www.ltmetro.com/ లోకి వెళ్లాలి. Current Oppurtunities అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలు చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత… KeolisHyd.Jobs@keolishyderabad.com పంపాలి.
ఎంపిక విధానం: మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి.. ఆ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.