కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీని.. యాంటీ ధోనీ ఫ్యాన్స్ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. అందుకు అతడు చేసిన ఓ చిన్న పొరపాటే కారణం. అదేంటో ఇప్పుడు చూద్దాం..
భారత మాజీ సారథి, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నెట్టింట ట్రోల్ కు గురవవుతున్నారు. అందుకు ధోని చేసిన ఓ చిన్న పొరపాటే కారణం. మ్యాచ్ టాస్ సమయంలో అలాంటివి కామన్ అయినా, ధోనీ హ్యేటెడ్ ఫ్యాన్స్ పని గట్టుగొని అతనిని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ధోని చేసిన పొరపాటు ఏంటంటారా..? తుది జట్టులో ఉన్న ఆటగాళ్ల పేర్లు మర్చిపోయాయడు. ఈ మాత్రం దానిని ఎత్తిచూపడమే తప్పుడు పని, అలాంటిది ట్రోల్ చేయడం అంటే పని గట్టుకొని చేస్తున్నది. దీంతో ధోని అభిమానులకు, ధోనీ హ్యేటెడ్ ఫ్యాన్స్ కు మధ్య ట్విట్టర్ వేదికగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. అతడు చేసిన ఆ తప్పేంటో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం చెపాక్ వేదికగా సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ వేసే సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు మైదానంలోకి చేరుకున్నారు. టాస్ గెలిచిన ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంతవరకూ అన్నీ సజావుగానే సాగినా, తుది జట్టు ఆటగాళ్ల విషయంలో ధోని చిన్న పొరపాటు చేశాడు. తుది జట్టులో ఏమైనా మార్పులు ఉన్నాయా అని అడగ్గా.. ”అవును.. దూబే స్థానంలో రాయుడు జట్టులోకి వచ్చాడు” అని పేర్కొన్నాడు. వాస్తవానికి శివం దూబే, అంబటి రాయుడు ఇద్దరూ జట్టులో ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ పేరు చెప్పబోయి పొరపాటున దూబే పేరు చెప్పాడు.
WON THE TOSS, BATTING FIRST AND RAYUDU IN PLACE OF DUBE. pic.twitter.com/314EXJ6mS3
— Heisenberg ☢ (@internetumpire) May 10, 2023
ఈ విషయం కాస్త ధోనీ హ్యేటెడ్ ఫ్యాన్స్ కంట పడడంతో నెట్టింట అతనిని ట్రోల్ చేస్తున్నారు. ”ధోనీకి తుది జట్టులో ఎవరున్నారన్న దానిపై కెప్టెన్‌కే క్లారిటీ లేదు..” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. “ధోనీకి వయసు మళ్లింది కనుక జ్ఞాపకశక్తి మందగించింది..” అంటూ మితిమీరిన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ధోనీ, సీఎస్‌కే అభిమానులకు.. ధోనీ హ్యేటెడ్ ఫ్యాన్స్ కు మధ్య ట్విట్టర్ వేదికగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It was never a mistake from dhoni at toss. We were not understanding that
Usually rayudu used to be impact player. But this time Dube is going to be. Since we are batting first, he directly starts in playing XI. Thats all
While bowling dube will be replaced with santner or…
— msd_stan (@bdrijalab) May 10, 2023