ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్ హవా నడుస్తుంది. ఫార్మాట్ ఏదైనా.. లీగ్ ఏదైనా అదరగొట్టేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఇంటిని నిర్మించుకున్న సిరాజ్.. తాజాగా ఆర్సీబీ ఆటగాళ్లకు బ్యాటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాడు.
ఐపీఎల్ లో భాగంగా రేపు (గురువారం ) సన్ రైజర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ టీం ఇప్పుడు గెలిస్తే ప్రత్యర్థి అవకాశాలు దెబ్బతీయడం మినహా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరోవైపు ఆర్సీబీకి మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఆ జట్టు ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే మిగిలిన రెండు మ్యాచులు తప్పకుండా గెలిచి తీరాయాల్సిందే. దీంతో రేపు జరగబోయే మ్యాచ్ ఆర్సీబీకి చావో రేవో లాంటిది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బౌలర్ సిరాజ్ ప్రస్తుతం ఆర్సీబీ ఆటగాళ్లకు బ్యాటింగ్ చిట్కాలు ఇవ్వడం వైరల్ గా మారింది.
ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్ హవా నడుస్తుంది. ఫార్మాట్ ఏదైనా.. లీగ్ ఏదైనా అదరగొట్టేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఇంటిని నిర్మించుకున్న సిరాజ్.. తాజాగా ఆర్సీబీ ఆటగాళ్లకు బ్యాటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాడు. ముఖ్యంగా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ని ఇమిటేట్ చేస్తూ.. బ్యాటింగ్ ఎలా ఆడాలో చూపిస్తున్నాడు. సరదాగా చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. రేపు సన్ రైజర్స్ తో హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ సిరాజ్ కి హోమ్ గ్రౌండ్ కావడం విశేషం. దీంతో ఇది నా గడ్డ.. నేను చెప్పింది మీరు వినాలని సిరాజ్ సూచిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మరి సొంత గడ్డపై సిరాజ్ ఎలా చెలరేగుతాడో చూడాలి. మొత్తానికి ఒక బ్యాటర్ గా మారి అందరిని సర్ ప్రైజ్ చేసిన సిరాజ్ చెప్పిన చిట్కాలునవ్వులు తెప్పిస్తున్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.