క్రికెట్లో 35 ఏళ్లకు పైబడిన ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్ చేసినా ఫీల్డింగ్‌లో అంత చురుగ్గా కనిపించరు. గాయాలు, వయసు ప్రభావంతో మునుపటి స్థాయిలో ఫీల్డింగ్ చేయలేరు. కానీ కొందరు ఆటగాళ్లు దీనికి మినహాయింపు అనే చెప్పాలి. ఫిట్నెస్ను మెయింటెయిన్ చేస్తూ కుర్రాళ్లతో పోటీపడుతుంటారు. అలాంటి వారిలో శిఖర్ ధవన్ ఒకడు.
క్రికెట్‌కు టీమిండియా అందించిన గొప్ప లెఫ్టాండర్ బ్యాటర్లలో శిఖర్ ధవన్ ఒకడు. జాతీయ జట్టులోకి కాస్త లేటు వయసులో ఎంట్రీ ఇచ్చిన ధవన్.. తనకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు. వన్డేలతో పాటు టెస్టు టీమ్‌లోనూ రెగ్యులర్ ప్లేయర్‌గా మారాడు. అయితే ఆ తర్వాత ఫెయిలవ్వడంతో వన్డేలకే పరిమితం అయ్యాడు. 37 ఏళ్ల ఈ డాషింగ్ ఓపెనర్ కుర్రాళ్లకు తీసిపోని రేంజ్లో ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తున్నాడు. దీనికి బుధవారం ఢిల్లీ క్యాపిటిల్స్, పంజాబ్ కింగ్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక క్యాచ్‌ను ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో ఒక స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు ధవన్. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 11 ఓవర్ రెండో బాల్.. డేవిడ్ వార్నర్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకి గాల్లోకి లేచింది.
వార్నర్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకి గాల్లోకి లేచిన బాల్‌ను కవర్స్‌లో ఉన్న ధవన్ ఎడమ వైపునకు పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే తొలుత బాల్ అతడి చేతి నుంచి జారిపోతుందేమోనని అనిపించింది. కానీ ధవన్ కిందపడినా ఆ బాల్‌ను మాత్రం ఒడిసి పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వయసులోనూ ఇంత ఫిట్‌గా ఉన్నావేంట్రా బాబు అంటూ ధవన్‌ను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇకపోతే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 15 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ రెండు వికెట్లకు 213 రన్స్ చేసింది. వార్నర్ (46), పృథ్వీ షా (54), రూసో (82) అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే గట్టిదెబ్బ తగిలింది. కెప్టెన్ ధవన్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అథర్వ టైడే (55), లియామ్ లివింగ్‌స్టోన్ (94) చెలరేగినప్పటికీ మ్యాచ్‌ను ఫినిష్ చేయలేకపోయారు.
Stunning from Shikhar Dhawan 🙌
(via @IPL) #PBKSvDC #IPL2023 pic.twitter.com/px5hB5y1dH
— ESPNcricinfo (@ESPNcricinfo) May 17, 2023