స్టార్ క్రికెటర్లంటే అభిమానులు ఉండడం సహజం ! అందులో విశేషం ఏముంది అనుకోకండి. ఇక్కడే రోహిత్ అభిమానులు అందరికీ భిన్నంగా వ్యవహరిస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పటివరకు ఎవ్వరు చేయని ఒక పనితో అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ క్రేజ్ గురించి మనకు తెలిసిందే. తన క్లాస్ బ్యాటింగ్ తో చూడముచ్చటైన షాట్లతో హిట్ మ్యాన్ చాలా మంది అభిమానులని సంపాదించుకున్నాడు. స్టార్ క్రికెటర్లంటే అందరికీ అభిమానులుంటారు ! అందులో విశేషం ఏముంది అనుకోకండి. ఇక్కడే రోహిత్ అభిమానులు అందరికీ బిన్నంగా వ్యవహరిస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పటివరకు ఎవ్వరు చేయని ఒక పనితో అందరికీ ఆదర్శంగా నిలిచారు. మరి రోహిత్ అభిమానులు ఎం చేశారో తెలుసుకోవాలంటే కింద చెదివేయాల్సిందే.
ఐపీఎల్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే చేధించింది. మ్యాచ్ సంగతి అలా ఉంచితే నిన్న(ఏప్రిల్ 30) రోహిత్ శర్మ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో అభిమానులు రకరకాలుగా వారి ప్రేమను రోహిత్ మీద వ్యక్తపరిచారు. రోహిత్ శర్మది ముంబై కావడం వలన అక్కడ అభిమానులు కోలాహలం ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈలిస్టులో హైదరాబాద్ అభిమానులు , కర్ణాటక అభిమానులు కూడా ఉండడం విశేషం.
హైదారాబాద్ అభిమానులు rtc క్రాస్ రోడ్స్ లో 60 అడుగుల భారీ కటౌట్ ని నెలకొల్పి రోహిత్ కి బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. రెండు రోజులు ముందే ఈ హడావుడి ప్రారంభమైంది. అయితే ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా కర్ణాటక అభిమానులు హిట్ మ్యాన్ పుట్టిన రోజు వేడుకలను చేయడం విశేషం. కర్ణాటకలోని పేద పిల్లలకు భోజనం, ఫుడ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ విషయంలో రోహిత్ అభిమానులు చాలా మంది మంది అభిమానులకి ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. మరి రోహిత్ అభిమానులు చేసిన ఈ మంచి పని మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Rohit Sharma fans from Karnataka distributed food, sweets and study material to kids.
A beautiful gesture! pic.twitter.com/H1CfEuxq4X
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2023