హమ్మయ్యా.. రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చేశాడు. అదే టైంలో ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో తొలి మ్యాచ్ గెలిపించాడు. దీంతో ముంబయి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ అంటే చాలామంది చెప్పే పేర్లలో ముంబయి ఇండియన్స్ కచ్చితంగా ఉంటుంది. ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిచింది. ప్రతి సీజన్ లో తన అత్యుత్తమ ఆటతో క్రికెట్ ప్రేమికుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేసే ముంబయి.. ఈ సారి ఎందుకో ఘోరంగా తడబడుతూ వచ్చింది. బెంగళూరు, చెన్నై జట్లపై వరసగా మ్యాచులు ఓడిపోయింది. యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ తప్పించి.. మిగతా ఏ బ్యాటర్ కూడా క్రీజులో నిలబడటమే ఇష్టం లేనట్లుగా ఔటైపోతూ వచ్చారు. ఇలాంటి టైంలో ముంబయి జట్టుకి అసలు గెలిచే ఉద్దేశం ఉందా? అని ఫ్యాన్స్ అనుకోసాగారు. ఇలాంటి టైంలో దిల్లీపై గెలిచి బోణీ కొట్టింది.
ఇక విషయానికొస్తే.. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ, 172 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వార్నర్ 51, అక్షర్ పటేల్ 54 రన్స్ కొట్టి.. వీళ్లు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముంబయి బౌలర్లు చావ్లా, బెహ్రండార్ఫ్ తలో 3 వికెట్లు తీయగా.. మెరిడిత్ 2, షోకీన్ 1 వికెట్ తీశారు. ఛేదనలో ముంబయి గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 65, ఇషాన్ కిషన్ 31 ఆచితూచి బ్యాటింగ్ చేసినప్పటికీ ఫాస్ట్ గానే ఆడారు. వికెట్ల పడటంతో కాస్త నెమ్మదించినప్పటికీ తిలక్ వర్మ 41, టిమ్ డేవిడ్ 13, గ్రీన్ 17.. లాంఛనాన్ని పూర్తి చేసి జట్టుని గెలిపించారు. అయితే ఈ విజయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ ముందే గెస్ చేశాడు.
మీరు విన్నది కరెక్టే. ముంబయి జట్టు ప్రాక్టీసులో భాగంగా.. ‘చాలా కష్టపడుతున్నాం. రేపు తమకు ముఖ్యమైన రోజు. కచ్చితంగా గెలుస్తాం’ అని చెప్పాడు. అనుకున్నట్లుగానే మ్యాచ్ ని గెలిపించాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. చాలారోజుల నుంచి బ్యాటింగ్ లో పూర్తిగా తడబడుతున్న రోహిత్.. ఈ మ్యాచ్ లో 45 బంతుల్లో 65 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ప్రాక్టీసు టైంలో చెప్పినట్లుగానే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ముందు ముందు మ్యాచుల్లోనూ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ముంబయి ఇండియన్స్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేస్తుంది. అయితే ఇషాన్ కిషన్, సూర్య కుమార్ తదితరులు కుదురుకోవాలి. లేదంటే కష్టమైపోతుంది. సరే ఇదంతా పక్కనబెడితే మ్యాచ్ గెలుస్తామని, కమ్ బ్యాక్ ఇస్తామని రోహిత్ ముందే ఊహించడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.