రహానె ఈసారి ఐపీఎల్ లో పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు. చెప్పాలంటే బాదడమే పనిగా పెట్టుకున్నాడు. దీనంతటికీ ఆ అవమానమే కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?
ఈసారి ఐపీఎల్ చూస్తుంటే ఫుల్ మజా వస్తోంది. ఎందుకంటే సీజన్ ప్రారంభానికి ముందు అస్సలు చాలామందికి ఇంట్రెస్ట్ లేదు గానీ గతవారం రోజుల నుంచి పూర్తిగా సీనే మారిపోయింది. ఎంతలా అంటే ప్రతి మ్యాచ్, థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ అయితే చాప కింద నీరులా హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ లోకి వచ్చేసింది. అయితే చెన్నై గెలవడానికి మెయిన్ రీజన్ అంటే అందరూ ధోనీ కెప్టెన్సీ అంటారు. కానీ ఈ సీజన్ లో సీఎస్కేకి ఆడుతున్న రహానె విశ్వరూపం చూపిస్తున్నాడు. తనని అవమానించిన ప్రతి ఒక్కరికీ బ్యాటుతో సమాధానం చెబుతున్నాడు. చెప్పాలంటే చుక్కలు చూపిస్తున్నాడు.
అసలు విషయానికొస్తే.. అజింక్య రహానె గురించి టీమిండియా ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి బ్యాటర్, కామ్ గా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. అయితే మారుతున్న క్రికెట్ ట్రెండ్ కి తగ్గట్లు ఎందుకో మారలేకపోయాడు. స్లోగా బ్యాటింగ్ చేసే రహానె.. ఐపీఎల్ లోనూ గతంలో కొన్ని మ్యాచులు మినహా చాలా అంటే చాలా నార్మల్ గా ఆడేవాడు. అప్పట్లో అంటే జట్లు అన్నీ ఆడించడానికి ఇంట్రెస్ట్ చూపించాయి. ఈసారి వేలంలో రహానెని ఒక్క జట్టు కూడా వేలంలో కొనలేదు. చివరకు చెన్నై సూపర్ కింగ్స్.. రహానె కనీస ధర రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది.
సీఎస్కే టీమ్ రహానెని కొనుగోలు చేసేసరికి చాలామంది విమర్శించారు. ‘టెస్టు ప్లేయర్’, ‘ఫాస్ట్ గా బ్యాటింగ్ చేయడు’ ఇలా చాలా ట్రోల్ చేశాడు. ఈ కారణాల వల్లే ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా రహానెని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాంటి ఇతడు.. చెన్నై జట్టులోకి వచ్చేసరికి పూర్తిగా మారిపోయాడు. గత కొన్ని మ్యాచుల్లో రహానె బ్యాటింగ్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ నోరెళ్ల బెట్టి చూస్తున్నారు. ఎందుకంటే ఆ రేంజులో పిచ్చకొట్టుడు కొడుతున్నాడు. ముంబయిపై 67, ఆర్సీబీపై 37, రాజస్థాన్ పై 31 పరుగులు చేశాడు. ఈ రన్స్ అన్నీ కూడా చాలా తక్కువ బంతుల్లోనే చేశాడు.
తాజాగా కేకేఆర్ తో మ్యాచ్ లో అయితే 29 బంతుల్లో 71 రన్స్ కొట్టి నాటౌట్ గా నిలిచాడు. ఇదంతా చూస్తుంటే.. తనని ఏ ఫ్రాంచైజీలైతే వద్దనుకున్నాయో.. వాళ్లని గుర్తుపెట్టుకుని మరీ వాళ్ల జట్టుపైనే రహానె బాదుతున్నాడా అనిపిస్తోంది. ప్రస్తుతం రహానె ఊపు చూస్తుంటే.. టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చినాసరే ఆశ్చర్యపోనక్కర్లేదు అనిపిస్తోంది. ఎంత ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ సపోర్ట్ చేసినా సరే రహానె నుంచి ఈ రేంజ్ విధ్వంసం ఎవరూ ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. ఒకవేళ ఈ సీజన్ లో చెన్నై కప్ గెలిస్తే, దానికి వన్ ఆఫ్ ది రీజన్ కచ్చితంగా రహానె అవుతాడు. మరి ఇతడి విధ్వంసానికి రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Ajinkya Rahane has the highest strike rate in IPL 2023 – 199.05
One of the Great comeback stories in IPL. pic.twitter.com/E1gu6VvTt3
— Johns. (@CricCrazyJohns) April 24, 2023