ముంబయి ఇండియన్స్ అభిమానులక వెరీ బ్యాడ్ న్యూస్. ఈసారి ఐపీఎల్ ఆడే విషయమై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దీనికి మేనేజ్ మెంట్ కూడా ఒప్పేసుకుంది. ఇంతకీ ఏంటి విషయం?
ఈసారి ఐపీఎల్ ఎలా ఉండబోతుందో ఏంటో? ఎందుకంటే అన్ని ఫ్రాంచైజీలకు ఆడాల్సిన చాలామంది స్టార్ ప్లేయర్స్ గాయాల కారణంగా దూరమవుతూ వస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనూ మరికొందరు స్టార్ క్రికెటర్లు.. ఈసారి ఐపీఎల్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చేరిపోయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే టైంలో రోహిత్ లేకపోతే కెప్టెన్ ఎవరనేది కూడా ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది!
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇంతకు ముందు వరకు అంటే రోహిత్ శర్మ భారత జట్టులో కేవలం ప్లేయర్ మాత్రమే. ఇప్పుడు కెప్టెన్. దానికి తోడు మరికొన్ని నెలల్లో టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తోపాటు స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇవి రెండు లేదంటే కనీసం ఒక్కటైనా మనం గెలిచి తీరాలి. లేదంటే మన జట్టు పరువు పోవడం పక్కా. అందులో భాగంగానే ఈసారి ఐపీఎల్ ని రోహిత్ శర్మ లైట్ తీసుకోనున్నట్లు సమాచారం. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా కొన్ని మ్యాచులు మాత్రమే ఆడనున్నాడు.
రాబోయే ఐసీసీ మెగాటోర్నీలకు ఫిట్ గా ఉండేందుకే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోహిత్ రిక్వెస్ట్ కు ముంబయి ఇండియన్స్ మేనేజ్ మెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆర్టికల్ రాసింది. అయితే ఈ న్యూస్.. అటు ముంబయి ఇండియన్స్.. ఇటు రోహిత్ ఫ్యాన్స్ నిజంగా బ్యాడ్ న్యూసే. రోహిత్ కొన్ని మ్యాచులకు ఉండడు కాబట్టి కొత్త కెప్టెన్ గా సూర్యకుమార్ బాధ్యతలు తీసుకుని జట్టుని ముందుండి నడిపించనున్నాడు. ఇదిలా ఉండగా మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ 15వ సీజన్.. మే 28 వరకు జరగనుంది. సరే ఇదంతా పక్కనబెడితే కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐపీఎల్ కొన్ని మ్యాచులే ఆడటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.