ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లో చెన్నై జట్టు అద్భుతంగా రాణిస్తోంది. అయితే ఓ విషయంలో మాత్రం ధోని ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తున్నాడు. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
మహేంద్ర సింగ్ ధోని.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన ఆటతో, తన కెప్టెన్సీ వ్యూహాలతో క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇక ఐపీఎల్ లో తిరుగులేని రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని.. ధోని అంటే చెన్నైగా ముద్ర పడిపోయింది. అంతలా తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు మిస్టర్ కూల్. 40 పదుల వయసు దాటినా గానీ ఇంకా తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తు.. వస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లో సైతం ముందుండి చెన్నై టీమ్ ను నడిపిస్తున్నాడు. మోకాలి నొప్పి బాధపెడుతున్నప్పటికీ, ఆ బాధను దిగమింగుకుని అభిమానుల కోసం ఆడుతున్నాడు ది ఫినిషర్. అయితే చెన్నైకి వరుస విజయాలు అందిస్తున్నప్పటికీ ఓ విషయంలో ఫ్యాన్స్ ను నిరాశపరుస్తూ వస్తున్నాడు ఈ మహేంద్రుడు. మరి ఏ విషయంలో ఫ్యాన్స్ ను అసంతృప్తి పరుస్తున్నాడో ఇప్పుడు చూద్దాం.
మహేంద్ర సింగ్ ధోని.. వరల్డ్ క్రికెట్ లో ది బెస్ట్ ఫినిషర్ గా తనకంటూ ఓ పేరును క్రియేట్ చేసుకున్నాడు. ఒన్స్ ధోని క్రీజ్ లో ఉన్నాడు అంటే చాలు ప్రత్యర్థికి ఓటమి ఖాయమనే చెప్పాలి. అదీకాక ధోని బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే అభిమాలను అంతా టీవీలకు అతుక్కుపోతుంటారు. అందుకు సాక్ష్యం ప్రస్తుతం బద్దలు అవుతున్న టీఆర్పీ వ్యూయర్ షిప్ రేటింగే. ఇక ధోనికి ఫ్యాన్స్ తో పాటుగా మిగతా ఆటగాళ్ల అభిమానులు కూడా ధోని ఆటకు ఫిదా అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఐపీఎల్ 2023లో 5 మ్యాచ్ లు ఆడిన చెన్నై 3 విజయాలు, రెండు అపజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక చెన్నైని ప్రస్తుతం వరుసగా విజయాలు అందిస్తున్నా గానీ.. ధోని ఫ్యాన్స్ ను ఓ విషయంలో నిరాశకు గురిచేస్తున్నాడు.
ఇంతకీ ఏ విషయంలో ధోని ఫ్యాన్స్ నిరాశకు గురి అవుతున్నారో తెలుసా? బెస్ట్ ఫినిషర్ గా ఉన్నా గానీ కొన్ని మ్యాచ్ ల నుంచి తన నుంచి బెస్ట్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా రాలేదు. గత కొంత కాలంగా ధోని తన బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చుకుని 7, 8వ స్థానాల్లో బ్యాటింగ్ కు దిగుతున్నాడు. దాంతో అప్పటికీ ఓవర్లు అన్ని పూర్తి కావొస్తుండటంతో.. ఒకటి, రెండు ఓవర్లు మాత్రమే ఆడే అవకాశం వస్తుంది. దాంతో ధోని అనుకున్నంతగా రాణించడానికి స్కోప్ దొరకడం లేదు. మ్యాచ్ విన్నింగ్స్ ఎలా ఉన్నా ధోని నుంచి మునుపటి ధోనిని లా ఫినిషర్ ని చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ధోని మాత్రం జట్టులో ఉన్న యువ ఆటగాళ్లకు ఛాన్స్ లు ఇచ్చేందుకే తన స్థానాన్ని మర్చుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ధోని నుంచి బెస్ట్ ఫినిషింగ్ ఇన్నింగ్స్ రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మరి ధోని మునుపటి ఫినిషర్ గా లేకపోవడానికి కారణం ఏంటో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.