Mitchell Marsh Wedding: ఐపీఎల్ 2023లో ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఆటగాడు ఆ జట్టుకు దూరం అవుతున్నాడు. అయితే గాయంతో కాదులేండి..
ఐపీఎల్ 2023లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. క్రికెట్ అభిమానులకు ఫుల్ మజాను పంచుతూ.. ఒక మ్యాచ్‌కు మించి మరో మ్యాచ్ జరుగుతోంది. అయితే.. దాదాపు అన్ని జట్లు ఒక మ్యాచ్ ఓడి మరో మ్యాచ్ గెలిస్తుంటే.. ఒక్క ఢిల్లీ మ్యాచ్ ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడింది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు రెండేసి విజయాలతో ఉన్నాయి. ముంబై, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్కో ఓటమితో ఉన్నాయి. అయితే.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేపర్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా.. గ్రౌండ్‌లో మాత్రం దారుణంగా నిరాశపరుస్తోంది. లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ.. గుజరాత్ టైటాన్స్ చేతిలోనూ ఓటమి పాలైంది. కెప్టెన్ వార్నర్ రాణిస్తున్నా.. మిగతా బ్యాటర్లు నిరాశ పరుస్తున్నారు.
ఇలా రెండు వరుస ఓటములతో ఢీలా పడిన ఢిల్లీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఆ జట్టు స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్ వారం రోజుల పాటు ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. తన పెళ్లి కోసం ఒక వారం పాటు సెలవు పెట్టి.. స్వదేశానికి వెళ్తున్న మార్ష్.. పెళ్లి చేసుకుని వారం తర్వాత తిరిగొచ్చి జట్టులో చేరనున్నాడు. అయితే.. ఇప్పటి వరకు ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మార్ష్ దారుణంగా విఫలం అయ్యాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన మార్ష్.. గుజరాత్‌పై కేవలం నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే.. ఇప్పుడు మార్ష్ లేకపోవడం జట్టుపై పెద్దగా ప్రభావం చూపదని క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mitchell Marsh flying back home for his wedding. He’ll be unavailable for a week. (Reported by Cricbuzz).
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2023