Kavya Maran: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కావ్య మారన్ ఓనర్. అలాగే తనే బ్రాండ్ అంబాసిడర్లా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఆడే మ్యాచ్‌లకు హాజరవుతూ.. జట్టును ఎంకరేజ్ చేస్తుంది. గెలిస్తే సంతోషంతో గెత్తులేస్తుంది. ఓడితే బాధపడిపోతుంది.. ఆమె హవాభావాలకు సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంది.
ఐపీఎల్ 2023 సీజన్‌ను సన్‌రైజర్స్ రెండు వరుస ఓటములతో ప్రారంభించింది. ఐపీఎల్ మినీ వేలంలో స్టార్ ఆటగాళ్లును కొనుగోలు చేసిన జట్టును స్ట్రాంగ్ చేసిందని.. సన్‌రైజర్స్ టీమ్ ఓనర్ కావ్య మారన్‌ను అంతా మెచ్చుకున్నారు. కానీ.. తీరా సీజన్ మొదలైన తర్వాత చూస్తే జట్టు దారుణంగా తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. దీంతో కావ్య మారన్ ఎంపికపై విమర్శలు వచ్చాయి. అయితే.. గెలుపోటములను పక్కనపెడుతూ మరీ కావ్య ప్రతి మ్యాచ్‌ను స్టేడియంలో చూస్తూ.. టీమ్‌ను ఉత్సాహపరుస్తూ ఉంటుంది. ఆటలో పూర్తిగా లీనమైపోయే కావ్య.. జట్టు పరిస్థితులకు అనుగుణంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సన్‌రైజర్స్ టీమ్ మంచి ప్రదర్శన చేస్తున్నా, ఆటగాళ్లు వికెట్లు తీసినా, భారీ సిక్సులు బాదినా ఉత్సాహంతో ఎగిరిగంతులు వేస్తుంటుంది.
అలాగే టీమ్ ఓటమి దిశగా సాగుతున్నా.. టీమ్ వికెట్ కోల్పోయినా.. ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నా.. చాలా డల్‌గా కూర్చుండి పోతుంది. ఇలా టీమ్ గెలుపోటములను చాలా ఓన్ చేసుకుంటుంది. సన్‌రైజర్స్ టీమ్‌కు కావ్యనే బ్రాండ్ అంబాసిడర్లా ఉంటుంది. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో కావ్య మారన్ హవాభావాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. ఒకానొక దశలో కావ్య డల్‌గా ఉన్న ఫొటోలు పెట్టి.. ‘ఎందుకు రా కావ్య పాపను ఏడిపిస్తారు, కనీసం తన కోసమైనా మ్యాచ్‌లు గెలవండ్రా’ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. పెద్ద పెద్ద మీడియా సంస్థలు సైతం సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలిస్తే.. ‘కావ్య పాప నవ్విందోచ్’ అంటూ భారీ భారీ హెడ్లైన్లు పెట్టి వార్తలు ఇస్తుంటారు. అది కావ్య క్రేజ్.
అయితే.. ఆదివారం సొంత మైదానం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అద్భుత విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. అయితే.. అంతకు ముందు పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సన్‌రైజర్స్ బౌలర్లు మిగతా బ్యాటర్లను త్వరగానే అవుట్ చేసినా.. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ మాత్రం చివరి వరకు క్రీజ్‌లో పాతుకుపోయాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ధావన్ భారీ షాట్లు ఆడుతున్న సమయంలో కెమెరామెన్ కెమెరాను పదే పదే కావ్య మారన్ వైపు తిప్పాడు. ధావన్ పరుగులు చేస్తుంటే డల్‌గా కూర్చున్న కావ్యకు కెమెరామెన్ పదే పదే చూపిండం చిరాకు తెప్పించింది. దీంతో ‘హఠా యార్’ అంటూ చాలా కోపం చెప్పింది. కెమెరామెన్‌ను గద్దించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Baby #kavyamaran 😂
To cameraman Hat rey 😹😹#SRHvPBKS pic.twitter.com/duImSUu5OZ— चयन चौधरी (@Chayanchaudhary) April 9, 2023