ప్లే ఆఫ్స్ లో క్వాలిఫయర్-1 మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే చెన్నై-గుజరాత్ జట్లు ఇందులో తలపడబోతున్నాయి. ఈ టైంలో గుజరాత్ ఓపెనర్ గిల్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
ఐపీఎల్ లీగ్ దశ యమ ఇంట్రెస్టింగ్ సాగింది. నాలుగు జట్లు ఫ్లే ఆఫ్స్ లో అడుగుపెట్టేశాయి. చెన్నై-గుజరాత్ టీమ్స్ మధ్య తొలి మ్యాచ్ చెపాక్ లో జరగనుంది. దీనికోసం ఇరుజట్లు పక్కా ప్లాన్స్ సిద్ధమవుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్.. చెన్నైపై గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టాలి, కప్ కొట్టేయాలి అన్నంత ఊపు మీద ఉంది. సీఎస్కే మాత్రం ఇలాంటి టైంలో తమ అనుభవాన్ని బయటకు తీయాలని స్కెచ్ వేస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చెప్పాలంటే ధోనీసేనకు స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. ఇప్పుడు ఇది కాస్త ఫ్యాన్స్ మధ్య చర్చకు కారణమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గత సీజన్ లో చెన్నై, ముంబయి జట్ల ఘోర ప్రదర్శన చేశాయి. దీంతో పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచాయి. ఈసారికి వచ్చేసరికి బౌన్స్ బ్యాక్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ తో చెన్నైకి ఈ రోజు మ్యాచ్ ఉంది. ఇప్పటివరకు చెన్నైతో తలపడిన అన్ని మ్యాచ్ ల్లోనూ ఈ జట్టు గెలిచేసింది. కానీ చెపాక్ లో తొలిసారి ఆడనుంది. అదే టైంలో ప్లే ఆఫ్స్ లో ఎలా ఆడాలో చెన్నైకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి టైంలో సీఎస్కే టీమ్ కి గిల్ చిన్నసైజ్ వార్నింగ్ ఇచ్చేలా కామెంట్స్ చేశాడు.
‘చెపాక్ వికెట్ పై చెన్నైని ఫేస్ చేసేందుకు మా దగ్గర అద్భుతమైన బౌలింగ్ ఉందని నేను అనుకుంటున్నాను. చెన్నై జట్టుతో వాళ్ల సొంతగడ్డపై తలపడటం కోసం మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం. రెండోసారి మేం ఫైనల్ లో అడుగుపెడతామని నమ్మకం మాకుంది.’ అని గిల్ చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి చెన్నైని ఓడిస్తామని గిల్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అదే టైంలో వరసపెట్టి రెండు సెంచరీలు చేసిన గిల్.. ప్రస్తుతం 680 పరుగులతో ఉన్నాడు. ప్రస్తుత ఫామ్ ని బట్టి చూస్తే డుప్లెసిస్(730)ని గిల్ దాటేయడం పెద్ద కష్టమేమి కాదు కూడా. మరి సీఎస్కేతో మ్యాచ్ కి ముందు గిల్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.