గుజరాత్ తో జరిగిన తొలి మ్యాచులో చెన్నై జట్టు ఓడిపోయి ఉండొచ్చు. కానీ ధోనీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ. దానికి ఓ కారణం లాస్ట్ ఓవర్ లో బ్యాటింగ్ అయితే మరో రీజన్.. ధోనీ ఏకంగా మూడు సరికొత్త రికార్డులని నమోదు చేయడం విశేషం.
చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ నేమ్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ టోర్నీ మొదలై 15 ఏళ్లు పూర్తయిపోయింది. దాదాపు మిగతా అన్ని జట్లకు కెప్టెన్లు మారుతూ వచ్చారు గానీ చెన్నైకి మాత్రం ధోనీ ఫిక్స్. గత సీజన్ లో జడేజాతో ప్రయోగం చేశారు. కానీ అది సరిగా వర్కౌట్ కాకపోయేసరికి ధోనీనే మళ్లీ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుత సీజన్ లో గుజరాత్ తో తొలి మ్యాచులోని ఫస్ట్ ఇన్నింగ్స్ చివరలో వచ్చిన ధోనీ.. 6, 4 కొట్టి ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాడు. అదే సమయంలో ఈ మ్యాచ్ తోనే మూడు సరికొత్త రికార్డులు నమోదు చేశాడు.
ఇక విషయానికొస్తే.. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్-చెన్నై జట్ల మధ్య ఈ సీజన్ తొలి మ్యాచ్ జరిగింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు.. ఈ పోరులోనూ గెలిచి ఊపు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. చివరివరకు ఎంతో థ్రిల్లింగ్ జరిగిన ఈ మ్యాచులో ఇరుజట్ల ఆటగాళ్లు బాగానే ఆడినప్పటికీ.. విజయం మాత్రం హార్దిక్ సేననే వరించింది. సరే ఇదంతా పక్కనబెడితే.. దాదాపు ప్రతి సీజన్ లోనూ తన మార్క్ చూపిస్తూ వచ్చిన ధోనీ.. ఈ ఒక్క మ్యాచులో ఆడటం ఏమోగానీ మూడు ఐపీఎల్ రికార్డులు నమోదయ్యాయి. మరి అవేంటో చూసేద్దామా?
ధోనీ అనగానే అందరికీ ఫినిషర్ గుర్తొస్తాడు. అలా ఐపీఎల్ లో దాదాపు చివరి ఓవర్లలో వచ్చే ధోనీ.. 20వ ఓవర్ లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. తర్వాత స్థానంలో పొలార్డ్ 33 సిక్సులతో ఉన్నాడు. అలానే చెన్నై తరఫున 200 సిక్సులు కొట్టిన తొలి ప్లేయర్ గానూ ధోనీ ఘనత సాధించాడు. ఈ లిస్టులో ధోనీ కంటే ముందు గేల్ (RCB)-239, డివిలియర్స్ (RCB) -238, పొలార్డ్ (ముంబయి) -223, కోహ్లీ (RCB)-218 ఉన్నారు. మరోవైపు ఈ టోర్నీలో ఎక్కువ వయసులో కెప్టెన్ గా చేసిన ఆటగాడిగానూ ధోనీ నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు షేన్ వార్న్ (41 ఏళ్ల 249 రోజులు) పేరిట ఉండగా.. ఇప్పుడు ధోనీ (41 ఏళ్ల 267 రోజులు) దాన్ని అధిగమించాడు. ఇలా జస్ట్ ఒకే ఒక్క మ్యాచుతో మూడు సరికొత్త రికార్డులని సృష్టించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ధోనీ సరికొత్త రికార్డ్స్ పై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
The box office – MS Dhoni’s six. pic.twitter.com/p7qd7dKo6d
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2023