చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ చూడ్డానికి అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలోనే ధోని స్టేడియంలో కనిపించగానే అభిమానులు ధోని, ధోని అంటూ నినాదాలు చేశారు.. ఆ నినాదాలతో స్టేడియం మెుత్తం దద్దరిల్లింది. ఇక స్టేడియంలోని అభిమానులకు ధోని చేతులు జోడించి దండం పెట్టిన వీడియో వైరల్ గా మారింది.
“మహేంద్ర సింగ్ ధోని” కేవలం భారత క్రికెట్లోనే కాదు ప్రపంచ క్రికెట్లో ఈ పేరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది . క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించినా ఒక ప్లేయర్ కి ఇంత క్రేజ్ ఎలా సాధ్యం అనే రీతిలో ఉంటుంది ఈ మిస్టర్ కూల్ ఫాలోయింగ్. ఇక ఐపీఎల్ వస్తే చాలు ఫ్యాన్స్ ధోని ధోని అనే నినాదాలతో స్టేడియం హోరెత్తుతోంది. అతడు గ్రౌండ్ లోకి అడుగు పెట్టినా, ఆఖరికి గ్లవ్ వేసుకుంటున్నా అభిమానుల చూపు ఈ మహేంద్రుడి వైపే ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఎప్పటిలాగే అభిమానులు చెన్నై చెపాక్ స్టేడియంలో ధోనీ ధోని అంటూ సందడి చేస్తూ కనిపించారు. అదేంటి ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవ్వలేదుగా అప్పుడే స్టేడియంలో అభిమానుల కోలాహలం ఏంటి అనుకుంటున్నారా అయితే ఇది తెలుసుకోవాల్సిందే.
ఐపీఎల్ మార్చి 31 న ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. తొలి మ్యాచ్ లో గెలిచి బోణి కొట్టాలని ఇరు జట్లు భావిస్తుండగా.. గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కి వేదిక కానుంది. తుది జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 పక్కన పెడితే మ్యాచ్ హోరా హోరీగా సాగడం ఖాయం అని క్రీడా పండితులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.
భారత అభిమానులు ఎంతగానో ఎదురు చూసే ఐపీఎల్ కి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ వేదికగా మంగళవారం ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ ప్రత్యర్థి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. స్వయంగా చెన్నై సూపర్ కింగ్స్ టీమే హోమ్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడడడం గమనార్హం. ఎప్పుడు లేని విధంగా తొలిసారి ప్రాక్టీస్ మ్యాచ్ కి మూడు స్టాండ్లలో అభిమానులను అనుమతివ్వగా.. అంతా నిండిపోవడం విశేషం. ఇక ధోని బ్యాటింగ్ కి సిద్ధవుతూ సహచర ఆటగాళ్లతో బ్యాటింగ్ టెక్నీక్ గురించి చర్చిస్తుండగా.. మరోవైపు ధోని ధోని అనే స్లోగన్ తో స్టేడియం దద్దరిల్లిపోయింది. దీంతో ధోని అభిమానులకెళ్లి చూస్తూ.. చేతులెత్తి దండం పెట్టాడు. ప్రస్తుతం ధోని పెట్టిన దండం బాగా వైరల్ అవుతోంది. ఈ మధ్యనే స్టేడియంలోని కుర్చీలకి పసుపు కలర్ పెయింటింగ్ వేస్తూ సందడి చేసిన కెప్టెన్ కూల్.. ఇప్పుడు తనదైన శైలిలో ఫ్యాన్స్ కి నమస్కారం చేసి అభిమానులని ఖుషి చేసాడు.
MS Dhoni to fans : 🙏😍 !! @MSDhoni #IPL2023 #WhistlePodu pic.twitter.com/GoziuvOiEo
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) March 28, 2023