ఆర్సీబీ టీమ్ లో ధోనీ కనిపించాడు. అవును మీరు విన్నది నిజమే. కుర్ర క్రికెటర్ ధోనీ స్టైల్ ని ఫాలో అయిపోయి మరీ ఔట్ చేశాడు. ప్రస్తుతం ఇదే ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఆర్సీబీ గెలిచేసింది. ప్లే ఆఫ్స్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది. చాలా అంటే చాలా ముఖ్యమైన మ్యాచ్ లో, బలమైన రాజస్థాన్ రాయల్స్ ని తక్కువ పరుగులకే ఆలౌట్ చేసి మరీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలింగ్ చూసిన ప్రతి ఒక్కరికీ మైండ్ పోయింది. ఎందుకంటే రాజస్థాన్ బ్యాటర్లు వచ్చినోళ్లు వచ్చినట్లే పోవడం అవాక్కయ్యేలా చేసింది. ఈ మ్యాచ్ లో జరిగింది కాస్త పక్కనబెడితే.. ఓ ఔట్ మాత్రం చాలా స్పెషల్ గా నిలిచింది. చెప్పాలంటే వింటేజ్ ధోనీ గుర్తొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ vs ఆర్సీబీ మ్యాచ్ అనేసరికి అందరూ కంగారు పడ్డారు. కానీ తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 171/5 స్కోరు చేసింది. రాజస్థాన్ ఫామ్ చూస్తే ఇదేమంత పెద్ద కష్టం కాదని అందరూ అనుకున్నారు. రియాలిటీలో మాత్రం జరిగింది వేరు. ఆర్సీబీ బౌలర్లు కేక పుట్టించే బంతులేయడంతో 59 పరుగులకే ప్రత్యర్థి జట్టు ఆలౌట్ అయిపోయింది. దీంతో ఆర్సీబీ, పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రన్ రేట్ ని కూడా చాలావరకు మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ వికెట్ కీపర్ అనూజ్ రావత్ ధోనీని గుర్తుచేశాడు.
అది 8వ ఓవర్ చివరి బంతి క్రీజులో ఉన్న హెట్మయిర్ కర్ణ్ శర్మ వేసిన బంతిని పాయింట్ దిశగా కొట్టాడు. బౌండరీ లైన్ దగ్గరున్న ఫీల్డర్.. దాన్ని అందుకుని కీపర్ అనూజ్ రావత్ దగ్గరకు విసిరాడు. అప్పటికే వికెట్ల దగ్గర వెనక్కి తిరిగి ఉన్న ఆర్సీబీ కీపర్.. ఏం చూడకుండా కాళ్ల మధ్యలో నుంచి బంతిని వికెట్ల వైపుగా విసిరాడు. రన్ కోసం వస్తున్న రాజస్థాన్ బ్యాటర్ అశ్విన్ ఔటయ్యాడు. ఈ ఔట్, వికెట్ కీపింగ్ స్టైల్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. అనూజ్ రావత్ ధోనీని గుర్తుచేశాడని అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి ఈ ఔట్ చూసిన తర్వాత మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.
Anuj Rawat with MS Dhoni signed gloves recreated his no-look run-out.
📸: Jio Cinema | @AnujRawat_1755 | @msdhoni pic.twitter.com/UYbWPTpBsx
— CricTracker (@Cricketracker) May 14, 2023
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!
The Anuj Rawat direct-hit that left everyone in disbelief 🔥🔥
Check out the dismissal here 🔽 #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP
— IndianPremierLeague (@IPL) May 14, 2023