ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ మ్యాచులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. లీగ్ మ్యాచులు ముగిసేసరికి పాయింట్స్ టేబుల్లో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో ఏయే జట్లకు ఎంతవరకు అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. 20 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. 16 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా దాదాపు తమ బెర్త్‌లు ఖాయం చేసుకున్నాయి. ఇక ఉన్న ఒక్క నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్.. ఇలా ఐదు జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు..!
మే 21న ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్ చేరుతుంది. అలా కాకుండా.. ముంబై చేతిలో ఢిల్లీ ఓటమిపాలై.. గుజరాత్‌పై ఆర్‌సీబీ విజయం సాధిస్తే.. కోహ్లీ టీమ్ టోర్నీలో ముందడుగు వేస్తుంది. ఇక ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓటమిపాలైతే.. కేకేఆర్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా రేసులో నిలుస్తాయి. అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. పంజాబ్ కింగ్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో మెరుగైన రన్ రేట్‌తో విజయం సాధించాలి. ఎలాంటి విజయం అంటే.. 100 పరుగుల తేడాతో లేదా 8 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేలా విజయం ఉండాలి. పంజాబ్ కింగ్స్ పై.. దాదాపు ఇది అసాధ్యం. అద్భుతం జరిగితే తప్పా సన్‌రైజర్స్ టోర్నీలో ముందడుగు వేయడం కష్టమే.
Gujarat titans becomes the first team to qualify into paly offs.#IPL2022 #LSGvGT pic.twitter.com/8FlsWDTtLt
— Backchod Indian (@IndianBackchod) May 11, 2022
సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ ఫార్మూలా ఇదే
ఢిల్లీపై ముంబై 75 పరుగులతో గెలిస్తే.. సన్‌రైజర్స్, పంజాబ్ పై 75 పరుగులతో గెలవాలి. ఒకవేళ ముంబై, ఢిల్లీపై 100 పరుగులతో గెలిస్తే.. సన్‌రైజర్స్, పంజాబ్ పై 50 పరుగులతో గెలవాలి. అంటే.. ఢిల్లీపై ముంబై X పరుగులతో గెలుస్తుంది అనుకుంటే.. సన్ రైజర్స్, పంజాబ్ పై.. 150 – X పరుగులతో గెలవాలి అన్నమాట. ఇలా ఇతర జట్ల విజయావకాశాలపై సన్ రైజర్స్ భవిష్యత్ ఆధారపడి ఉంది.
SRH’s Playoff scenario:
– LSG beat KKR.
– GT beat RCB.
– MI beat DC by 75 runs.
– SRH beat PBKS by 75 runs.– if MI win by 100 Runs, SRH need to win by 50.
– if MI wins by X Runs, SRH need to win by 150 – X.Bottom-line – SRH will need massive help from Mumbai Indians.
— uppala shivaprasad (@shivauppala93) May 18, 2022
ఇక.. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఆఖరి బంతికి గట్టెక్కింది!. మొదట బ్యాటింగ్‌లో రాహుల్ త్రిపాఠి, ప్రియమ్ గార్గ్, నికోలస్ పూరన్ దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన విలియమ్సన్ సేన.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని అడ్డుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత రైజర్స్‌కు ఇది తొలి విజయం కావడం గమనార్హం. మొత్తానికి లీగ్‌లో ఆరో విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ ఖాతాలో12 పాయింట్లు ఉండగా.. 8వ స్థానంలో కొనసాగుతోంది. మరి సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరుతుందా? లేదా?.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Points Table IPL 2022 Till Match 65 🏆. #IPL #IPL2022 #IPLTATA #GT #RR #RCB #SRH #LSG #PBKS #CSK #MI pic.twitter.com/1VPE1msoTW
— CricCircle (@thecriccircle) May 18, 2022
ఇది కూడా చదవండి: Glenn Maxwell: వేడికి తట్టుకోలేక ఐస్ నీళ్లలో తలపెట్టిన మాక్స్ వెల్.. వీడియో వైరల్!