‘సన్ రైజర్స్ హైదరాబాద్’ ఐపీఎల్ అనగానే గత సీజన్ నుంచి ఈ ఫ్రాంచైజీ మీదే అందరి దృష్టి. ఎందుకంటే వారి నిర్ణయాలు, యాజమాన్యం తీరు అంత చిత్ర విచిత్రంగా ఉంటుంది మరి. గతేడాది నుంచి వాళ్లు ఏం చేసినా.. టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోతోంది. వార్నర్ ను దూరం చేసుకున్నా.. రషీద్ ఖాను కాదనుకున్నా.. అన్ క్యాప్డ్ ప్లేయర్ కు రూ.6.5 కోట్లు ఖర్చు పెట్టినా వాళ్లకే చెల్లింది. ఇప్పుడు అలాంటి నిర్ణయమే మరొకటి తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఒకెత్తు అయితే.. ఇది నెక్ట్స్ లెవల్ అనమాట.
విషయం ఏంటంటే.. హైదరాబాద్ టీమ్ యాజమాన్యం తమ జట్టుకు కేన్ మామను కెప్టెన్ గా కొనసాగిస్తుందని అందరికీ తెలిసిందే. కానీ, వైస్ కెప్టెన్ విషయంలో ఓ పేరును నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అతడే అభిషేక్ శర్మ. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ పై గుర్రుగా ఉన్న అభిమానులు ఈ మాట వినగానే మళ్లీ చిర్రుబుర్రులు మొదలు పెట్టారు. అన్ క్యాప్డ్ ప్లేయర్ అయిన అభిషేక్ శర్మను రూ.6.5 కోట్లకు కొనడమే దండగ అని అనుకుంటుంటే.. ఇప్పుడు వైస్ కెప్టెన్సీ ఇస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు.
అభిషేక శర్మ ఐపీఎల్ లో రాణించింది కూడా ఏమీ లేదు. 22 మ్యాచ్ లు ఆడి 241 పరుగులు చేశాడు. 14 ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయగా.. 7 వికెట్లు సాధించాడు. ఇంకో ఆశ్చర్యపరిచే వార్త కూడా చక్కర్లు కొట్టింది. అభిషేక్ కోసం రూ.10 కోట్లు పెట్టడానికి కూడా సన్ రైజర్స్ సిద్ధపడిందంట. ఈ వార్త తెలియగానే అభిమానులు నోరెళ్లపెట్టారు. ప్రస్తుతం టీమ్ లో కెప్టెన్ తర్వాత వాషింగ్ టన్ సుందర్, పూరన్ తప్ప మరెవరూ రాణించేలా కనిపించడం లేదు. గతేడాది పరాభవాలకు ఈ సీజన్ లో ఎలాంటి సమాధానం చెబుతుందో అని ఎదురుచూస్తున్నారు. సన్ రైజర్స్ యాజమాన్యం ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.