ఐపీఎల్-2022 సీజన్ లో వరుసగా ఆరు మ్యాచులు ఓడిన ముంబై జట్టు.. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో పోరాడి ఓడింది. బ్యాటింగ్ లో విఫలమైనా.. కట్టుదిట్టంగాబౌలింగ్ వేయడంతో సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావించారు. అయితే.. చివర్లో ధోని ధనా ధన్ బ్యాటింగ్ తో విజయం చెన్నైని వరించింది. లో స్కోరింగ్ గేమ్ అయినా చివరివరకు ఉత్కంఠను రేపింది. ముంబై నిర్దేశించిన 156 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై.. ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. అయితే.. మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రవీంద్ర జడేజా, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
సీఎస్కే కెప్టెన్ రవీంద్ర జడేజా, ముంబై కీలక ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ అందరితో ఎంత సరదాగా ఉంటారో తెలిసిందే. ఇక వీరిద్దరూ ఎదురు పడటంతో హోటల్ లో నవ్వులు పూశాయి. “ఒకసారి అటు, మరోసారి ఇటు, గ్రౌండ్ అంతా ఆడుతున్నావ్ గా” అని జడేజా సూర్యతో అంటుండగా.. సూర్య కల్పించుకొని.. “ఎలా అయితేనేం నాకోసం కరెక్టుగా ఫీల్డరును అయితే సెట్ చేశావ్ గా” అంటూ అంతే ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు. ఆటలో భాగమైన గెలుపు, ఓటముల గురుంచి పట్టించుకోకుండా సంతోషంగా ఉన్న ఆటగాళ్లను చూసి నెటిజన్లు తెగ సంతోషపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇది కూడా చదవండి: వీడియో: వీరి స్నేహం ఎంతో మధురం! గ్రౌండ్‌లోనే బ్రావోకు పొలార్డ్ ముద్దు!
ఇక ఐపీఎల్ టోర్నీకే కళ తెచ్చిన ముంబై, చెన్నై జట్లు ఈ సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాయి. ఈ సీజన్ లో దాదాపు సగానికి పైగా మ్యాచులు అయిపోగా.. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు చివరి రెండు స్థానాల్లో ఉండటం విశేషం. ఏదేమైనా.. జడేజా, సూర్య సరదా సంభాషణ మాత్రం సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Match 33 Points Table#MIvsCSK #MI #CSK#MumbaiIndians #WhistlePodu#TATAIPL #IPL2022 pic.twitter.com/bMQrtu4hj0
— K A V I N (@Hitmankavin) April 22, 2022
Tweets galore as MS Dhoni finishes things off in style! 😊😊#TATAIPL pic.twitter.com/W4Svmumyln
— IndianPremierLeague (@IPL) April 21, 2022
ధోని ధనా ధన్ ఇన్నింగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి: సచిన్ కనిపించగానే దద్దరిల్లిపోయిన స్టేడియం!