ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతులెత్తేసింది. బ్యాటర్లు రాణించినా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. భారీ లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేకపోయింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పంజాబ్.. ఈ ఓటమితో మరింత దిగజారింది. పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో ఛేదించి అద్భుత విజయాన్నందుకుంది.
రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ ప్రక్రియలో అంటిపెట్టుకున్న ముగ్గురు ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ ఒకడు. అయితే.. మొదటి 3 మ్యాచులకు జైస్వాల్ చేసిన స్కోర్.. 25 పరుగులు. దీంతో తర్వాత మ్యాచులకు అతడిని కూర్చోబెట్టారు. కానీ ఏడు మ్యాచుల తర్వాత పునరాగమనం చేసిన జైస్వాల్ తనదైన ఆటతో తానెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. కీలక సమయంలో భాద్యతాయుతంగా ఆడి రాజస్తాన్ ను ప్లేఆఫ్స్ కు మరింత చేరువ చేశాడు. ఈ గెలుపుతో రాజస్థాన్ 11 మ్యాచుల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి మూడో స్థానానికి ఎగబాకింది.
💥🏏 MAKING A STATEMENT! Yashasvi Jaiswal has played an outstanding knock in his comeback innings to register his first fifty of #IPL2022 .
📸 IPL • #YashasviJaiswal #PBKSvRR #RRvPBKS #IPL #IPL2022 #TATAIPL #BharatArmy pic.twitter.com/4HCelXvEr1
— The Bharat Army (@thebharatarmy) May 7, 2022
ఇది కూడా చదవండి: Jos Buttler: వీడియో: జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సింగిల్ హ్యాండ్‌తో..
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో(40 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో) హాఫ్ సెంచరీతో రాణించగా.. జితేశ్ శర్మ(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీయగా.. అశ్విన్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులతో సునాయస విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్ (41 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్స్‌లతో 68) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. షిమ్రన్ హెట్‌మైర్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా.. రబడా, రిషి ధావన్ తలో వికెట్ పడగొట్టారు.
Rajasthan Royals Registered Their 7th Victory of the Season 🏏👍#RRVSPBKS #TATAIPL #IPL #IPL2022 #Rajasthanroyals #Cricket #cricketslide pic.twitter.com/wU5c0UzfiJ
— Cricketslide (@cricketslide) May 7, 2022