గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్టు వల్ల ఒక వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు. అలాంటి సమయంలో సీపీఆర్ చేస్తే ఆ వ్యక్తి బతికే అవకాశం ఉంటుంది. మరి సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకోండి.
గుండెపోటు అనేది ఎప్పుడు ఏ సమయంలో వస్తుందో అంచనా వేయలేము. ఒక మనిషి మన కళ్ళ ముందే గుండెపోటుతో పడిపోతే సీపీఆర్ చేయడం ద్వారా తిరిగి ఆ మనిషిని బతికించుకోవచ్చు. సీపీఆర్ అంటే కార్డియో పల్మొనరీ రెసస్కిటేషన్. సీపీఆర్ చేయడం వల్ల గుండెపోటు వచ్చిన వ్యక్తులను తిరిగి బతికించుకునే అవకాశం ఉంది. అకస్మాతుగా గుండె ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే గుండె పనితీరు పూర్తిగా తగ్గిపోవడం లేదా 200 కంటే ఎక్కువ సార్లు గుండె కొట్టుకుని ఆగిపోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అనేది వస్తుంది. ఐతే ఇలా అకస్మాత్తుగా పడిపోయిన వ్యక్తులకు సీపీఆర్ చేయడం ద్వారా బతికించుకోవచ్చు. ఇలా సీపీఆర్ చేసి కొంతమందిని కాపాడిన సందర్భాలను మనం చూశాం. అయితే మీరు చూస్తుండగా కార్డియాక్ అరెస్ట్ తో ఒక మనిషి పడిపోతే సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకోండి.
సీపీఆర్ చేస్తే ఆ వ్యక్తి 2 నిమిషాల్లోనే బతికే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సీపీఆర్ ఎలా చేయాలో అనే విషయాన్ని డాక్టర్ చెప్పిన వీడియో కింద ఉంది. వీడియోలో సీపీఆర్ ఎలా చేయాలి? సీపీఆర్ చేసేటప్పుడు పాటించవలసిన ప్రాథమిక సూత్రాలు ఏమిటి? అనే వివరాలు డాక్టర్ ప్రస్తావించారు. వీడియో చూస్తే సీపీఆర్ మీద మీకు మరింత అవగాహన వస్తుంది. మరి వీడియోని చూసి సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకోండి. అలానే ఈ ఆర్టికల్ ని ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి. సీపీఆర్ చేయడం వల్ల ఒక మనిషి ప్రాణాలను కాపాడినవారు అవుతారు. అలానే సీపీఆర్ గురించి మీకు తెలిసిన విషయాలను కామెంట్ల ద్వారా తెలియజేయండి.