నేడు సూర్య గ్రహణం ఏర్పడనుంది. అక్టోబర్ 25న దీపావళి మరుసటి రోజు సాయంత్రం గ్రహణం ఏర్పడబోతుంది. మన దేశంలో 4.40 నిమిషాల నుంచి 6.09 నిమిషాల వరకు ఈ గ్రహణం కనిపిస్తుంది. దీపావళి తర్వాత సూర్య గ్రహణం ఏర్పడనుండటంతో.. అది అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. 22 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన సూర్య గ్రహణం అని అంటున్నారు. ఇక హిందూ సంప్రాదాయంలో గ్రహణాలకు చాలా ప్రముఖ్యత ఉంది. ఆనాడు కొన్ని పనులు చేయకూడదని.. గ్రహణ సయమంలో కొన్ని పద్దతలు పాటించాలని చెబుతారు. మరీ ముఖ్యంగా గర్భిణిలు గ్రహణ సమయంలో అటు ఇటు తిరగకుండా.. ఎలాంటి పనులు చేయకుండా.. శారీరక శ్రమ చేయకుండా విశ్రాంతిగా పడుకోమని సూచిస్తారు.
ఇక గ్రహణ సమయంలో భోజనం చేయకూడదని చెబుతారు. గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న ఆహార పదార్థాల మీద గరిక పోచలు ఉంచడం వల్ల.. వాటిని గ్రహణం తర్వాత వాడుకోవచ్చు అంటారు. అలానే ఆ సమయంలో మిగిలిపోయిన అన్నం, కూరలు తినకుండా.. రాత్రికి మళ్లీ వంట చేసుకుని తినడం మంచిది అని చెబుతున్నారు. అలానే గ్రహణం పట్టడానికి ముందు.. గ్రహణం విడిచిన తర్వాత తలస్నానం చేయాలని సూచిస్తున్నారు. ఇక గ్రహణం విడిచిన వెంటనే మహిళలు ముందుగా చేయాల్సిన పని.. ఇంటిని శుభ్రం చేసుకుని.. తలస్నానం చేసి.. పూజ చేసుకోవడం ముఖ్యం అని చెబుతున్నారు. ఇక పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.